అన్వేషించండి

Bandi Bageerath Case: బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?

Bandi Bageerath: బండి భగీరథ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడి భవితవ్యం మొత్తం బాధితురాలి వయస్సు అనే ఏకైక పాయింట్ మీద ఆధారపడి ఉంది.

Bandi Bageerath Case Victim Age  : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడి భవితవ్యం మొత్తం బాధితురాలి వయస్సు అనే ఏకైక పాయింట్ మీద ఆధారపడి ఉంది. పోలీసులు ఇప్పటికే ఆమెను మైనర్‌గా గుర్తిస్తూ ప్రాథమికంగా పోక్సో చట్టం కింద సెక్షన్లు నమోదు చేశారు. ఒకవేళ విచారణలో బాధితురాలు మైనర్ అని న్యాయస్థానం ముందు నిరూపితమైతే, భగీరథ్‌కు కఠిన శిక్షలు తప్పవు. 

 పోలీసుల నిర్ధారణ.. సిట్ వేట 

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, బాధితురాలి స్కూల్ రికార్డులు , బోనఫైడ్ సర్టిఫికేట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ రికార్డుల ప్రకారం ఆమె మైనర్ అని తేలడంతోనే పోలీసులు పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. చట్టం ప్రకారం, బాధితురాలు మైనర్ అయితే ఆమె అంగీకారం  తో సంబంధం లేకుండా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అందుకే నిందితుల పక్షం ఈ వయస్సు ధృవీకరణను సవాల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, విద్యాశాఖ రికార్డుల ముందు ఇతర వాదనలు నిలవడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

 రికార్డుల విశ్లేషణలో సుప్రీంకోర్టు రూలింగ్స్ 

వయస్సు నిర్ధారణ విషయంలో సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. మొదటగా పదో తరగతి మార్కుల జాబితా లేదా పాఠశాల రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలి. అవి లేనప్పుడు మాత్రమే మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్ లేదా మెడికల్ బోర్డ్ ఇచ్చే  ఆసిఫికేషన్ టెస్ట్ నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. భగీరథ్ కేసులో విద్యా రికార్డుల ప్రకారం ఆమె మైనర్ అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, నిందితుడికి న్యాయపరంగా పెద్ద గండం పొంచి ఉన్నట్లే.

 సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు

మరోవైపు, సోషల్ మీడియాలో బాధితురాలు మేజర్ అని, ఆమెకు సంబంధించిన కొన్ని ఇతర ఐడెంటిటీ కార్డుల్లో పుట్టిన తేదీ వేరేలా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు విద్యా రికార్డుల ముందు కోర్టులో చెల్లవు. సిట్ అధికారులు జీహెచ్ఎంసీ రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని నిరూపించగలిగితే తప్ప, ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం బాధితురాలు మైనర్ అనే పాయింటే బలంగా కనిపిస్తోంది.

 భగీరథ్ భవిష్యత్తుకు పరీక్ష                          

ఈ కేసులో  అంగీకారం  అనే వాదన వినిపించడానికి నిందితుల వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, బాధితురాలు మైనర్ అని పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తే, అంగీకారంతో పని లేకుండానే విచారణ సాగుతుంది. పైగా పోక్సో కేసుల్లో బెయిల్ రావడం కూడా అంత సులభం కాదు. బాధితురాలి వయస్సుపై పోలీసులు సమర్పించే తుది నివేదిక భగీరథ్  భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ మైనర్ అని తేలితే మాత్రం, ఈ కేసు నుంచి బయటపడటం భగీరథ్‌కు అసాధ్యమనే చెప్పాలి.    

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget