(Source: ECI/ABP News/ABP Majha)
TDP Janasena PAC Meeting: నేడు టీడీపీ, జనసేన పీఏసీ మీటింగ్, ప్రధానంగా చర్చించే అశాలు ఇవే!
Janasena TDP Alliance: తెలుగుదేశం, జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
TDP Janasena Key Meeting Today: తెలుగుదేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పొలిటికల్ యాక్షన్ కమిటీ(Political Action Committee) గురువారం సమావేశం కానుంది. విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఈ భేటీకి హాజరవుతున్నారు. సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం(Common Minimum Programme) రూపకల్పనపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌తో పాటు మరికొన్ని అంశాలతో టీడీపీ ప్రతిపాదనలు రెడీ చేయగా.. మరోవైపు జనసేన కూడా షణ్ముక వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రతిపదించింది. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత మేనిఫెస్టోపై ఓ క్లారిటికీ రానున్నట్లు సమాచారం. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల దిశగా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి.
కరవు, ధరల పెరుగుదల, వంటి అంశాలపై పోరాడాలని ఇప్పటికే టీడీపీ - జనసేన పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తాజాగా ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియలో జనసేన భాగస్వామ్యంతో కలిసి పని చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకోసం టీడీపీ, జనసేన ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా టీడీపీ-జనసేన పార్టీలు ఓ కార్యాచరణ రూపొందించనున్నట్లు
హైదరాబాద్‌లో టీడీపీ పీఏసీ సమావేశం
హైదరాబాద్‌లోని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నివాసంలో నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం రాజకీయ కార్యాచరణ కమిటీ బుధవారం సమావేశమైంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ, నక్కా ఆనంద్ బాబు, వంగలపూడి అనిత, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై సమవేశంలో చర్చించారు. ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కమిటీ నిర్ణయించింది.
వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని సూచించింది. ఇసుక, మద్యం, కరవు, ధరలు, ఛార్జీల పెంపు అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిచాలని నిర్ణయం తీసుకుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించింది. భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంపై సమావేశంలో చర్చించింది.