అన్వేషించండి

Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?

Allu Arjun Prashant Kishor Meeting Truth : అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ? ప్రశాంత్ కిషోర్‌తో భేటీ నిజమేనా? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారా లేక ఏపీలో అడుగు పెడతారా?

Vijay TVK Impact on Tollywood Heroes:  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పుష్ప  చిత్రంతో గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. కోలీవుడ్‌లో నటుడు విజయ్  తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టి సక్సెస్ అయిన తరహాలోనే, బన్నీ కూడా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన దేశంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్   తో కూడా రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు కొన్ని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుకుంటున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై భిన్నమైన రాజకీయ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
  
 తెలంగాణలో ‘పుష్ప’ రూట్? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారా? 

సోషల్ మీడియా ఔత్సాహికులు  చేస్తున్న దాని ప్రకారం.. అల్లు అర్జున్ ఒకవేళ పార్టీ పెడితే అది తెలంగాణలోనే ఉంటుందని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. గతంలో పుష్ప-2  వివాదాల కారణంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం  అల్లు అర్జున్ విషయంలో కఠినంగా వ్యవహరించిందని, బన్నీపై కేసులు, అరెస్టుల వంటి పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందనే టాక్ నడిచింది.   తనను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి  ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ పుష్ప  సినిమా స్టైల్‌లో తెలంగాణ వేదికగానే రాజకీయ సమరానికి సై అంటారనేది ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఇస్తున్న లీక్. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ఏరియాల్లో బన్నీకి ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ దీనికి ప్లస్ అవుతుందని వారు లెక్కలు వేస్తున్నారు.
 
 ఏపీలో సామాజిక బలం .. జై ఆంధ్ర నినాదం సాధ్యమేనా? 

మరికొందరు విశ్లేషకులు మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ పాలిటిక్స్‌లోకి వస్తే ఖచ్చితంగా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌నే ఎంచుకుంటారని లెక్కలు వేస్తున్నారు. ఏపీలో అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించే సామాజిక వర్గానికి  బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గతంలో ప్రజారాజ్యం, జనసేన వంటి ప్రయోగాలు జరిగినప్పటికీ.. అల్లు అర్జున్ క్లీన్ ఇమేజ్‌తో, సొంత చరిష్మాతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ మార్పు వస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే  పవన్ కళ్యాణ్  ఏపీ డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్‌తో తలెత్తిన వివాదం ఇంకా పూర్తిగా సద్దణగలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగానో లేదా ఏపీలో మరో కొత్త అక్షాన్ని సృష్టించడానికో బన్నీ సాహసిస్తారా అన్నది సందేహమే. 

 కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రాజకీయాలు  ఆత్మహత్యా సదృశ్యమేనా? 

నిజానికి, ఒక నటుడు తన సినిమా కెరీర్ ముగింపు దశకు వస్తున్నప్పుడు లేదా క్రేజ్ తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయంగా రాజకీయాలను ఎంచుకోవడం సాధారణం. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యున్నత స్థానంలో ఉన్నారు.  పుష్ప  సిరీస్ తర్వాత ఆయన మార్కెట్ వందల కోట్లకు చేరింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. నటన పరంగా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు. ఇంతటి అద్భుతమైన ఫిల్మ్ కెరీర్‌ను పక్కనబెట్టి, వందల కోట్ల బిజినెస్‌ను వదులుకుని, ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం అనేది అల్లు అర్జున్ లాంటి ప్రాక్టికల్ మైండ్ ఉన్న హీరో అస్సలు చేయరనేది ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. 

 ప్రశాంత్ కిషోర్ భేటీ.. నిజమా, కేవలం గాసిప్పా? 

రాజకీయ పార్టీల స్థాపన, వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్ ను కలవడం అనేది ఈ మధ్య కాలంలో ఒక కామన్ ట్రెండ్‌గా మారింది. అయితే అల్లు అర్జున్, పీకేల మధ్య భేటీ జరిగిందనే దానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, బజ్ క్రియేట్ చేయడం కోసం కొందరు సృష్టించిన ఫేక్ నరేటివ్ గానే దీన్ని చూడాలి. అల్లు అర్జున్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం లేదా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలుస్తుంటారు మొత్తంగా చూస్తే.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనేది కేవలం సోషల్ మీడియా ఔత్సాహికుల ఊహాగానాలు మరియు గాసిప్స్ మాత్రమే. విజయ్ తరహాలో పార్టీ పెట్టే అంతటి గ్రౌండ్ లెవెల్ రాజకీయ అవసరం కానీ, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనే రివెంజ్ పాలిటిక్స్ కానీ అల్లు అర్జున్‌కు లేవు. సినిమా రంగాన్ని శాసిస్తూ, గ్లోబల్ స్టార్‌గా ఎదిగేందుకే బన్నీ తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కాబట్టి, నయా పొలిటికల్ పార్టీ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, బన్నీ ఫోకస్ అంతా కేవలం  సినిమా.. సినిమా.. సినిమా పైనే ఉందని అనుకోవచ్చు.  


 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget