Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు హీరో అని అనుకోలేదు - 'ఛాంపియన్' హీరోయిన్ కామెంట్స్ వైరల్
Anaswara Rajan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో రోషన్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'లో ఈమె హీరోయిన్‌గా చేస్తున్నారు.

Actress Anaswara Rajan Comments On Allu Arjun : టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తెలుగు హీరో అని తెలీదు
రామాయణం ఆధారంగా తీసిన బాలయ్య నటించిన 'శ్రీరామరాజ్యం' సినిమాను తాను తెలుగులో మొదటిగా చూసినట్లు చెప్పారు అనస్వర రాజన్. 'తెలుగులో నేను చూసిన ఫస్ట్ మూవీ 'శ్రీరామరాజ్యం'. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశాను. అయితే, అది తెలుగు మూవీ అని నాకు తెలీదు. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.
ఆ టైంలో అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలీదు. ఆయన్ను మలయాళ హీరోనే అనుకున్నా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'మగధీర' సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, నటులు గురించి తెలిసింది. అప్పటివరకూ నేను తెలుగు సినిమాలు చూస్తున్నానని నాకు తెలీదు.' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read : 'ది రాజా సాబ్' ఓటీటీ డీల్ - ఊహించిన దాని కంటే తక్కువే... ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్షన్
రోషన్ హీరోగా వస్తోన్న 'ఛాంపియన్' మూవీతోనే అనస్వర తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 'చంద్రకళ' పాత్రలో ఆమె కనిపించనున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా రూపొందించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై మూవీని నిర్మించారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















