The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ డీల్ - ఊహించిన దాని కంటే తక్కువే... ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్షన్
The Raja Saab OTT Deal : ప్రభాస్ 'ది రాజా సాబ్' ఓటీటీ డీల్‌పై ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు. ఓటీటీ ఒప్పందం జరిగిందని అయితే, తాము అనుకున్నంత కాలేదని చెప్పారు.

Prabhas's The Raja Saab OTT Deal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ సైతం ఫిక్స్ అయిపోగా... నాన్ థియేట్రికల్ బిజినెస్‌పై ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓటీటీ డీల్... బిగ్ ట్విస్ట్
తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో 'ది రాజా సాబ్' నాన్ థియేట్రికల్ బిజినెస్‌పై విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. నెల రోజుల క్రితమే ఓటీటీ డీల్ కన్ఫర్మ్ అయ్యిందని... అయితే, తాము అనుకున్నంత కలెక్షన్స్ కాలేదని తెలిపారు. ''ది రాజా సాబ్' ఓటీటీ డీల్ ముగిసింది. కానీ మేము ఊహించిన దాని కంటే తక్కువ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం OTT మార్కెట్ ఇలాగే పని చేస్తోంది.' అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : 'శంబాల' నుంచి 'పదే పదే' సాంగ్ - లిరిక్స్‌లోనే స్టోరీ రివీల్ చేశారా?... మనసును హత్తుకునే పాట
ఆ ఓటీటీలోకే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ముందుగా ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా భాషల్లో కలిపి మొత్తం రూ.170 కోట్ల డీల్ జరిగినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అయితే, తాము అనుకున్నంత బిజినెస్ జరగలేదని ప్రొడ్యూసర్ చెప్పడంతో అసలు అంత కన్నా తక్కువే జరిగిందా? లేదా ఎక్కువ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగిందని అనుకుంటున్నప్పటికీ... థియేట్రికల్ బిజినెస్, బాక్సాఫీస్ వసూళ్లు రికార్డు కలెక్షన్స్ కన్ఫర్మ్ అని మూవీ టీం భావిస్తోంది.
హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్ LB స్టేడియంలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్‌కు మూవీ టీంతో పాటు డార్లింగ్ ప్రభాస్ కూడా వస్తారని సమాచారం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఆడియన్స్ ముందుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. భారీగా వచ్చే ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్‌లో మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, సప్తగిరి, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. వింటేజ్ ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















