Shambhala Padhe Padhe Song : 'శంబాల' నుంచి 'పదే పదే' సాంగ్ - లిరిక్స్‌లోనే స్టోరీ రివీల్ చేశారా?... మనసును హత్తుకునే పాట
Shambhala Movie : యంగ్ హీరో ఆది సాయికుమార్ 'శంబాల' నుంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్ 'పదే పదే' వచ్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Aadi Saikumar's Shambhala Movie Padhe Padhe Song Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... తాజాగా 'పదే పదే' సాంగ్ రిలీజ్ చేశారు.
స్టోరీ రివీల్ చేసేలా... ఎమోషనల్ లిరిక్స్
'శంబాల' స్టోరీని రివీల్ చేసేలా హీరో ఫ్యామిలీ గురించి... ఆ కుటుంబానికి వచ్చిన కష్టం గురించి చెప్పే నేపథ్యంలో ఉన్న 'పదే పదే' సాంగ్ మనసులను హత్తుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందించగా... యామిని ఘంటసాల పాడారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు. ఆ ఎమోషనల్ హార్ట్ టచింగ్ లిరిక్స్ మీ కోసం...
'పదే పదే' సాంగ్ లిరిక్స్
పల్లవి
పదే పదే ఈ జీవితం నీ ప్రశ్నలే సంధించగా...
కలే ఇదా కథే ఇదా ఈ దారులే కలిశాయెలా...
విధి రాతే చదివే భాషనీ... ఎవరైనా నేర్పేటి దారి ఉందా?
నింగి నేల వాన వెల్లు కలిసిపోవా మెల్లగా...
ముగ్గురైనా ఒక్కరేగా... కొత్త పయనం మొదలుగా...
నింగి నేల వాన వెల్లు కలిసిపోవా మెల్లగా...
ముగ్గురైనా ఒక్కరేగా... కొత్త పయనం మొదలుగా...
చరణం 1
గతాలన్నీ మీ వెనుక మొదలుగా... ఈ పయనాన్ని చేయగా...
ఎటేపున్నా నీ కొత్త మజిలీ... ఈ బంధాలు చేర్చవా...
తెలిసి తెలియని వయసు ఒకరిది... మనసు మలినమే లేదుగా...
ఎదురు నిలిచినా స్నేహమొకరిది... కలిసి నడవరా తోడుగా...
వనమైనా తోటై మారదా... రణమైనా చిరునవ్వులెన్నో కలదా...
నింగి నేల వాన వెల్లు కలిసిపోవా మెల్లగా...
ముగ్గురైనా ఒక్కరేగా... కొత్త పయనం మొదలుగా...
నింగి నేల వాన వెల్లు కలిసిపోవా మెల్లగా...
ముగ్గురైనా ఒక్కరేగా... కొత్త పయనం మొదలుగా...
Also Read : పొలిటికల్ లీడర్ Or సీనియర్ ఆఫీసర్‌గా రేణు దేశాయ్? - 'బ్యాడ్ గాళ్స్' మూవీలో కీ రోల్
మూవీలో ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, హర్షవర్థన్, అన్నపూర్ణ అమ్మ, శ్రావణ సంధ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















