Shock For Somu Veerraju : జగన్, మీరు తోడు దొంగలు - అమరావతిలో సోము వీర్రాజుకు షాకిచ్చిన రైతు !
రాజధాని పాదయాత్ర చేస్తున్న సోము వీర్రాజుకు రైతు ఒకరు షాకిచ్చారు. ఆయన అన్నమాటలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయింది.
Shock For Somu Veerraju : రాజధాని గ్రామాల్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. "మన అమరావతి బీజేపీ సంకల్ప యాత్ర"ను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఉండవల్లిలో ప్రారంభించారు. నాల్గో తేదీ సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా పెనుమాక వెళ్లిన సోము వీర్రాజు అక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే సంవత్సరంలో రాజధాని నిర్మిస్తామని రైతులకు సోమువీర్రాజు హామీ ఇచ్చారు. అయితే అక్కడే ఉన్న పెనుమాకకు చెందిన వృద్ధ రైతు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు. జగన్, మీరు కలిసి తోడు దొంగలై రాజధానిని సర్వనాశనం చేశారని మొహం మీదనే చెప్పేశారు. ఆ రైతుకు సర్ది చెప్పాలని సోము వీర్రాజు ప్రయత్నించారు కానీ ఆయన వినిపించుకోలేదు. దీంతో సోము వీర్రాజు ముందుకెళ్లిపోయారు.
కేసినోలకు వెళ్తా, పేకాట ఆడతా కానీ చీకోటి ప్రవీణ్‌తో సంబంధం లేదు - ఏపీ మాజీ మంత్రి క్లారిటీ !
సోము వీర్రాజును పెనుమాక రైతు ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇతరులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
😂😂😂😂 Somu ni Okka dialogue tho thokkesadu pic.twitter.com/RczMnMGVKG
— samadhanam (@daivasahayam12) July 29, 2022
అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా నిర్ణయించింది గత ప్రభుత్వం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచి జరుగుతున్నాయి. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చారు. అమరావతిలో పనులన్నీ నిలిపివేశారు. ఆ సమయంలో బీజేపీ నేతలు తాము అమరావతికే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కానీ రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ చాయిస్ అని కేంద్రానికి సంబంధం లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ కూడా వైఎస్ఆర్‌సీపీకి సహకరిస్తోందని ఎక్కువ మంది భావించారు. పలువురు బీజేపీ నేతలు అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ నమ్మకం మరింత బలపడింది. అందుకే పెనుమాక రైతు సోము వీర్రాజుపై అలా విరుచుకుపడినట్లుగా భావిస్తున్నారు.
25 మంది ఎంపీలు రిజైన్ చేయండి, పోలవరం నిధులొస్తాయి - ఆయనో కోడికత్తి కమల్ హాసన్: చంద్రబాబు
అయితే అమరావతికి తాము మొదటి నుంచి మద్దతుగా ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేలకోట్లు ఓసారి, 2500కోట్లు మరోసారి నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ కోసం ఈ డబ్బుల వినియోగించలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. గత పరిణామాలతో రైతుల్ని నమ్మించడానికి బీజేపీ నేతలు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది.