Chandrababu: 25 మంది ఎంపీలు రిజైన్ చేయండి, పోలవరం నిధులొస్తాయి - ఆయనో కోడికత్తి కమల్ హాసన్: చంద్రబాబు
Chandrababu News: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
Chandrababu Demands YSRCP MP's Resignation: ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర మెడలు వంచుతానన్న ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు తన మెడలు తానే దించుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం కోసం కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంటాను.. మీరు నాకు ఓట్లు వేస్తూనే ఉండండి అన్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
వైఎస్ఆర్ సీపీకి ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం డబ్బులు ఇస్తుందని చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహంగానీ, ముందు చూపు గానీ లేదని, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని అలాంటి ధగాకోరు ప్రభుత్వానికి మేం ఏం చేయలేమని పార్లమెంటులో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు.
జిల్లా కేంద్రం చాలా దూరం
చేతకాకపోతే ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనపైనే వేసుకుంటానని అన్నారు. అల్లూరి జిల్లా ముఖ్య కేంద్రం ఇక్కడి నుంచి 400 కిలో మీటర్లు ఉందని, హైదరాబాద్, అమరావతి ఇంకా దగ్గర ఉంటుందని చెప్పారు. నష్టపోతున్న వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.
Also Read: Kakani Govardhan Reddy: అప్పు చెల్లిస్తారా పరువు తీయమంటారా? మంత్రికే లోన్‌యాప్ ఏజెంట్లు దమ్కీ
ప్రత్యేకంగా పోలవరం జిల్లా (Polavaram News)
టీడీపీ అధికారంలోకి వచ్చాక, నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. అందులో అన్నీ పోలవరం ముంపు మండలాలే పెట్టి, జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. అమరావతి రైతులను వెయ్యి రోజులుగా రోడ్లపై వదిశారని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. అలాగే పోలవరం ముంపు ప్రజల్ని ఇప్పుడు బురదలో వేశారని అన్నారు. అధైర్య పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పోరాడాలి. మీకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు.
‘‘సీఎం జగన్ కోడికత్తి కమల్ హాసన్ లాగా యాక్షన్ మొదలు పెట్టాడు. మళ్లీ పిల్లల్ని ఎత్తుకున్నాడు. ఆడబిడ్డల తలపై చెయ్యి పెట్టి నిమురుతున్నాడు. నేను ట్రాక్టర్ ఎక్కానని, ఆయన కూడా ఎక్కాడు. ఇలా డ్రామాలు ఆడేవాళ్లని నమ్మకూడదు. బాబాయిని చంపిన నాపైకి నెట్టారు. మళ్లీ రేపు ఎవర్నో చంపి నాపైకి నెట్టుతారు. ఇలాంటి సమాజానికి సేవ చేసే ఉద్దేశం లేని వారితో చాలా ప్రమాదరం’’ అని చంద్రబాబు విమర్శించారు.
Also Read: Lion for Sale: ఆ దేశంలో గేదెల కన్నా సింహాలే చీప్, కావాలంటే కొని తెచ్చుకోవచ్చు