అన్వేషించండి
Adilabad Latest News: మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్‌లు- ఆదిలాబాద్‌లో కీలక ప్రకటన చేసిన ఎండి సజ్జనార్
Adilabad Latest News: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. రోడ్ కనెక్టివిటి ఉన్న గ్రామాల్లో త్వరలో ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్‌లు- ఆదిలాబాద్‌లో కీలక ప్రకటన చేసిన ఎండి సజ్జనార్
1/11

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అద్భుతంగా కొనసాగుతుందని ఆర్టీసీ లాభాల బాటలో నడిపేందుకు మరింత కృషి చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.
2/11

సోమవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోను సందర్శించారు.
3/11

ఎండి సజ్జనార్‌ను ఆర్టీసీ డిపో ఆర్ఎం, డిఎం, ఆర్టీసీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
4/11

ఈ పర్యటనలో ఎండి సజ్జనార్ డిపో ఆవరణలో మామిడి మొక్క నాటి నీరు పోశారు.
5/11

డిపో అవరణలో మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వేసవిలో నీడను, చల్లదనాన్ని మంచి గాలిని అందిస్తాయన్నారు.
6/11

ఆర్టీసీ డిపోను సందర్శించి అధికారులను ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులను వారి పని విధానాన్ని డిపోలో ఇంకా కావలసిన బస్సులు ఇతర సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
7/11

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ abp దేశంతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
8/11

ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ఆర్టిసి ఉద్యోగులు కార్మికులు కూడా ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు.
9/11

ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ బీటి రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలోనూ ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు కృషి చేస్తామన్నారు.
10/11

ప్రజలు తమ సురక్షిత ప్రయాణానికోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టీ ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మారుమూల గ్రామాల్లో మెరుగుపరుస్తు ప్రజలకు చేరువలో ఉండేలా చూస్తామన్నారు.
11/11

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్టీసి సేవలను మరింతగా అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆర్టీసి సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. ఇదివరకే 3300 కొత్త బస్సులను తీసుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లోనూ మరిన్ని కొత్త బస్సులను తీసుకొని ప్రజలకు చెరువులో రవాణా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
Published at : 19 May 2025 09:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















