అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
KCR Birthday Photos: తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు
KCR Birthday Celebrations: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ లో కేసీఆర్ బర్త్‌డేని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాయి.
తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు
1/11

తెలంగాణ మాజీ సీఎం, BRS పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు (KCR Birthday Celebrations) శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు.
2/11

ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
3/11

10 మంది దివ్యాంగులకు వీల్ చైర్ లను కేటీఆర్ పంపిణీ చేశారు.
4/11

KCR 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు.
5/11

అనంతరం KCR జీవితం, రాజకీయ మైలురాళ్లు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
6/11

డాక్యుమెంటరీ ని గొప్పగా చేశారని తలసాని సాయి కిరణ్ యాదవ్ ను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ ఉద్యమం, KCR ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
7/11

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు BRS పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీమంతరులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు అన్నారు.
8/11

కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్ లకు ఒకొక్కరికి లక్ష రూపాయల కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను ఇచ్చారు.
9/11

BRS పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది BRS పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు.
10/11

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, BRS పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
11/11

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ సంబరాల ఏర్పాట్లను, నిర్వహణను చేశారు. ఈ వేడుకలకు KTR ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Published at : 17 Feb 2024 04:41 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎలక్షన్
పాలిటిక్స్
ఎలక్షన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















