అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women T20 Rankings: స్మృతి మంధాన కొడితే రన్సేంటి ర్యాంకులే దిగొస్తాయ్! ఎన్ని ర్యాంకులు జంప్ చేసిందో తెలుసా!
Women T20 Rankings: టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన వీరోచిత ఫామ్‌లో కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పైపైకి ఎగబాకుతోంది.
![Women T20 Rankings: టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన వీరోచిత ఫామ్‌లో కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పైపైకి ఎగబాకుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/787edeafe819d368981cb558c9abd9201663683418538251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్మృతి మంధాన
1/5
![టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన వీరోచిత ఫామ్‌లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారీ స్కోర్లు చేస్తోంది. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగై రెండో స్థానానికి ఎగబాకింది. 731 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ మెగ్‌లానింగ్ (725)ను వెనక్కి నెట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/87098002f661006265e31a7353af0efb8ac26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన వీరోచిత ఫామ్‌లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారీ స్కోర్లు చేస్తోంది. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగై రెండో స్థానానికి ఎగబాకింది. 731 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ మెగ్‌లానింగ్ (725)ను వెనక్కి నెట్టేసింది.
2/5
![కొన్ని నెలలుగా ఆసీస్ అమ్మాయిలు బెత్ మూనీ (743 రేటింగ్), మెగ్‌లానింగ్ వరుసగా 1, 2 స్థానాల్లో ఉంటున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో దుమ్మురేపిన స్మృతి వీరి ఆధిపత్యాన్ని అడ్డుకుంది. మరో అమ్మాయి షెఫాలీ వర్మ (666 రేటింగ్) ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ సిరీసులో ఆమె అంచనాలను అందుకోలేకపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/cd4a817ffe7213f5a479ea93dbdebe76eb9ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్ని నెలలుగా ఆసీస్ అమ్మాయిలు బెత్ మూనీ (743 రేటింగ్), మెగ్‌లానింగ్ వరుసగా 1, 2 స్థానాల్లో ఉంటున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో దుమ్మురేపిన స్మృతి వీరి ఆధిపత్యాన్ని అడ్డుకుంది. మరో అమ్మాయి షెఫాలీ వర్మ (666 రేటింగ్) ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ సిరీసులో ఆమె అంచనాలను అందుకోలేకపోయింది.
3/5
![ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీసులో స్మృతి మంధాన 111 పరుగులు సాధించింది. ఇక వన్డే సిరీస్ ఆరంభ మ్యాచులోనే అదరగొట్టింది. 91 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లను చితకబాదేసి 7 వికెట్ల తేడాతో విజయం అందించింది. మూడు స్థానాలు ఎగబాకి టాప్-7కు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సైతం 662 రేటింగ్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/16b037f794a8eda20767ac27f6cbc9b21f978.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీసులో స్మృతి మంధాన 111 పరుగులు సాధించింది. ఇక వన్డే సిరీస్ ఆరంభ మ్యాచులోనే అదరగొట్టింది. 91 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లను చితకబాదేసి 7 వికెట్ల తేడాతో విజయం అందించింది. మూడు స్థానాలు ఎగబాకి టాప్-7కు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సైతం 662 రేటింగ్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది.
4/5
![టీ20 ర్యాంకింగ్స్‌లో జెమీమా రోడ్రిగ్స్ (611 రేటింగ్), హర్మన్‌ప్రీత్ (603 రేటింగ్)తో వరుసగా 12, 14 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ జాబితాలో దీప్తి శర్మ (678), రేణుకా సింగ్ (644) వరుసగా 7, 10 ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/bb1544dd6d4de8ece4ed348e1e38cc13ff2f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీ20 ర్యాంకింగ్స్‌లో జెమీమా రోడ్రిగ్స్ (611 రేటింగ్), హర్మన్‌ప్రీత్ (603 రేటింగ్)తో వరుసగా 12, 14 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ జాబితాలో దీప్తి శర్మ (678), రేణుకా సింగ్ (644) వరుసగా 7, 10 ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉంది.
5/5
![వన్డే బౌలింగ్ జాబితాలో జులన్ గోస్వామి (689), రాజేశ్వరీ గైక్వాడ్ (625) వరుసగా 5, 7 ర్యాంకుల్లో ఉన్నారు. దీప్తి శర్మ 12వ ర్యాంకులో ఉంది. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమె ఆరో ర్యాంకులో కొనసాగుతోంది. వన్డే సిరీసులో ఇలాగే మెరుపులు మెరిపిస్తే స్మృతి మంధాన ర్యాంకు మరింత మెరుగవుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/80fda1c3fca4846b54f256673f736bcebb76f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వన్డే బౌలింగ్ జాబితాలో జులన్ గోస్వామి (689), రాజేశ్వరీ గైక్వాడ్ (625) వరుసగా 5, 7 ర్యాంకుల్లో ఉన్నారు. దీప్తి శర్మ 12వ ర్యాంకులో ఉంది. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమె ఆరో ర్యాంకులో కొనసాగుతోంది. వన్డే సిరీసులో ఇలాగే మెరుపులు మెరిపిస్తే స్మృతి మంధాన ర్యాంకు మరింత మెరుగవుతుంది.
Published at : 20 Sep 2022 07:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion