అన్వేషించండి
మార్గశిర పూర్ణిమ రోజు అన్నపూర్ణ జయంతి! ఈ వస్తువులను దానం చేస్తే జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతాయి!
Annapurna Jayanti 2025: డిసెంబర్ 4 మార్గశిర పూర్ణిమ రోజు అన్నపూర్ణాదేవి జయంతి. ఈ రోజు గోధుమలు, బియ్యం, పప్పుధాన్యాలు సహా ఇవన్నీ దానం చేస్తే జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు
అన్నపూర్ణ జయంతి 2025
1/7

మార్గశిర పూర్ణిమ రోజున దేవి అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు. ఈ తేదీన అమ్మ అన్నపూర్ణ అవతరించారని నమ్ముతారు. ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతి గురువారం డిసెంబర్ 4 2025 న వస్తుంది.
2/7

అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని పూజిస్తే ఇంట్లో ధాన్యం నిల్వలు ఎల్లప్పుడూ నిండి ఉంటాయని నమ్మకం. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
3/7

అన్నపూర్ణ జయంతి నాడు బార్లీని దానం చేయడం వల్ల గురు గ్రహం శుభత్వం పెరుగుతుంది. అలాగే కెరీర్ సంబంధిత అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
4/7

అన్నపూర్ణ జయంతి నాడు ఆవాలు దానం చేయడం కూడా శుభప్రదం. ఆవాల దానం చేయడం వలన జాతకంలో బలహీనంగా ఉన్న రాహువు బలపడతాడు.
5/7

గోధుమలను దానం చేయడం వల్ల సుఖసౌభాగ్యం పెరుగుతుంది . జాతకంలో సూర్య గ్రహం బలపడుతుంది. ఈ రోజున గోధుమలను దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట, ప్రభుత్వ పనులు , తండ్రికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి కలుగుతుంది. జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది.
6/7

మినుములు శని గ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. అన్నపూర్ణ జయంతి నాడు మినుములను దానం చేయడం వల్ల శని బాధలు తగ్గుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి .. పనిలో స్థిరత్వం వస్తుంది. జీవితంలో క్రమశిక్షణ, సహనం పెరుగుతుంది.
7/7

బియ్యాన్ని ధాన్యం సంపదకు చిహ్నంగా భావిస్తారు. అన్నపూర్ణ జయంతి నాడు ప్రత్యేకంగా బియ్యం దానం చేయాలి. దీనివల్ల ఇంటి వంటగది ఎప్పుడూ ఖాళీగా ఉండదు, సంపద కూడా పెరుగుతుంది.
Published at : 02 Dec 2025 10:10 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















