భారతదేశం, సింగపూర్ మధ్య జరిగే మారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసాలు (SIMBEX) శనివారం నాడు అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన సింబెక్స్ విన్యాసాలు నేటితో పూర్తయ్యాయి. భారత్, సింగపూర్ నౌకా దళాలు సంయుక్తంగా ఈ విన్యాసాలు చేపట్టాయి.
భారత యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ రణ్‌విజయ్, ఐఎన్ఎస్ కిల్టాన్, ఐఎన్ఎస్ కోరా నౌకలతో పాటు ఒక పీ8ఐ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ తరఫున.. ఫర్మిడబుల్ క్లాస్ ఫ్రిగేట్, ఆర్‌ఎస్‌ఎస్ స్టెడ్‌ఫాస్ట్, విక్టరీ క్లాస్ మిస్సైల్ కార్వేట్, ఎస్ 70బీ నేవల్ హెలికాప్టర్, ఆర్‌ఎస్‌ఎస్ విగార్, ఆర్చర్ క్లాస్ సబ్‌మెరైన్, ఫోకర్ 50 మేరిటైమ్ పాట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ సహా నాలుగు ఎఫ్ 16 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
1994 నుంచి భారత్-సింగపూర్ నౌకాదళాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సింబెక్స్ 28వ ఎడిషన్ కు ప్రత్యేకత సంతరించుకుంది. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలపరిచేందుకు ఈ విన్యాసాలు తోడ్పడతాయి.
కోవిడ్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల వల్ల.. ఎలాంటి భౌతిక చర్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి కేవలం సముద్రంలో మాత్రమే విన్యాసాలు నిర్వహించారు. దీనిని దక్షిణ చైనా సముద్రం యొక్క సరిహద్దుల్లో ఆర్ఎస్ఎన్ సింబెక్స్ విన్యాసాలను నిర్వహించింది.
సింబెక్స్ నౌకాదళ విన్యాసాలు
సింబెక్స్ నౌకాదళ విన్యాసాలు
YS Jagan: విశాఖలో గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకం: ఏపీ సీఎం జగన్
TDP Politburo Meeting: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం - 20 అంశాలపై చర్చ
Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి
Harry Brook, SRH: కోట్ల కుర్రాడు.. కొట్టే కుర్రాడు! SRH డెన్లోకి హ్యారీబ్రూక్ ఆగయా!
IPL 2023: ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్! ఒక రేంజులో ఐపీఎల్ టీమ్స్ ట్రైనింగ్!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!