అన్వేషించండి
Healthy Habits : భోజనం చేసిన వెంటనే ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందట.. బరువు కూడా
Blood Sugar : భోజనం తిన్న తర్వాత నిద్రపోవడం లేదా కూర్చోవడం ప్రమాదకరమని.. దానివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తున్నారు. మరి ఏమి చేస్తే మంచిందంటే..
భోజనం చేసిన తర్వాత చేయాల్సిన పని ఇదే
1/6

భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడానికి బదులుగా కొంచెం నడిస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుందని చెప్తున్నారు.
2/6

కాళ్ల మడమలను పైకి లేపి కిందకి దించడం (calf raises) వల్ల గ్లూకోజ్ కండరాలలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర పెరగడాన్ని కంట్రోల్ చేస్తుంది.
3/6

పరిశోధనల ప్రకారం భోజనం చేసిన తర్వాత తేలికపాటి శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయట. కాబట్టి తేలికపాటి నడక లేదా, వ్యాయామం చేయడం మంచిదని చెప్తున్నారు.
4/6

తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది పొట్ట, పేగులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సజావుగా ఉండేలా చేస్తుంది.
5/6

తేలికపాటి నడక లేదా ఒకే చోట మార్చ్ చేయడం వల్ల పొట్ట ఉబ్బరం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణకోశ అధ్యయనాలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి.
6/6

భోజనం చేసిన తర్వాత కొంచెం కదలండి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఈ చిన్నపనులే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయని చెప్తున్నారు.
Published at : 05 Sep 2025 08:55 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















