అన్వేషించండి
Tea Side Effects : టీ ఎక్కువ తాగితే ఆ లోపం తప్పదట.. ఆ లక్షణాలు ఉంటే వెంటనే తగ్గించేయండి
Drinking Too Much Tea : రోజుకు ఎక్కువ కప్పుల టీ తాగడం వల్ల శరీరంలో ఓ లోపం వస్తుందని.. దానివల్ల అలసట, బలహీనత పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.
టీ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవు
1/7

అధికంగా టీ తాగడం వల్ల శరీరంలో విటమిన్ B12 తగ్గుతుంది. టీలో ఉండే టానిన్లు శరీరంలో విటమిన్ B12ని తగ్గిస్తాయి. అందుకే ఎక్కువగా టీ తాగేవారిలో తరచుగా ఈ లోపం కనిపిస్తుందట.
2/7

విటమిన్ B12 లోపం ఉంటే శక్తి తగ్గిపోతుంది. త్వరగా అలసిపోతారు. పని చేయాలన్నా ఓపిక ఉండదు. పని చేసినా, చేయకున్నా నీరసంగా ఉంటుంది.
3/7

B12 లోపం మెదడు, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిరంతరం టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. పనిపై ఫోకస్ చేయలేరు.
4/7

విటమిన్ B12 లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. బలహీనత, తల తిరగడం, ముఖం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.
5/7

ఎక్కువ టీ తాగడం వల్ల B12 లోపం ఏర్పడి ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. నెమ్మదిగా కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు పెరుగుతాయి.
6/7

B12 లోపం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు పెరగవచ్చు.
7/7

మీకు టీ అలవాటు ఉంటే.. రోజుకు 1 నుంచి 2 కప్పుల కంటే ఎక్కువ టీ తాగవద్దు. అలాగే పాలు, గుడ్లు, పనీర్, పెరుగు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. తద్వారా B12 లోపం తగ్గుతుంది.
Published at : 05 Sep 2025 07:56 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















