అన్వేషించండి
Gold Ornaments : పెళ్లికోసం 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు చేయించుకోవచ్చా? మంచిదేనా?
Facts of Gold Ornaments : మీకు తెలుసా బంగారు ఆభరణాలు 24 క్యారెట్లతో చేయించుకుంటే మంచిదో కాదో.. నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బంగారు ఆభరణాలు గోల్డ్ కాదా ?
1/6

24 క్యారెట్ల బంగారంతో జ్యూవెలరీ చేయించుకోవడం కష్టం. ఎందుకంటే దీనితో చేసిన ఆభరణాలు చాలా మృదువుగా ఉంటాయి. కాబట్టి రోజువారీ వాడేందుకు మంచిది కాదు.
2/6

అందుకే ఆభరణాలు తయారు చేయడానికి 22 క్యారెట్ల బంగారం ఉపయోగిస్తారు. ఇందులో 91.6% బంగారం, 8.4% వెండి, రాగి లేదా పల్లాడియం ఉంటుంది.
3/6

అదేవిధంగా, 18 క్యారెట్ల బంగారం కూడా జ్యూవెలరీ చేసేందుకు ఉపయోగిస్తారు. ఇందులో 75% బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. ఇది 22 క్యారెట్ల బంగారం కంటే ఎక్కువ మన్నికైనది.
4/6

బంగారాన్ని వంచడానికి, గుంతలు లేకుండా జ్యూవెలరీ చేసేందుకు దానిలో రాగి, వెండి, పల్లాడియంను కలుపుతారు.
5/6

స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో చేసిన డిజైన్లు చాలా మృదువుగా ఉంటాయి. ఇందులో వివిధ లోహాలను కలిపి బంగారాన్ని సాగేలా చేయవచ్చు. దీనివల్ల సంక్లిష్టమైన డిజైన్ కూడా ఈజీ అవుతుంది.
6/6

24 క్యారెట్ల బంగారం పెట్టుబడికి ఉత్తమమైనది. ఆభరణాల కోసం కాదు. 24 క్యారెట్ల బంగారం గోల్డ్ బార్స్, నాణేలు, బులియన్ తీసుకోవచ్చు.
Published at : 21 Sep 2025 01:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















