అన్వేషించండి
సత్యభామ అక్టోబరు 09 ఎపిసోడ్ హైలెట్స్: గాల్లో తేలిపోతున్న క్రిష్ - రుద్రని అరెస్ట్ చేయించిన సత్య - మహదేవయ్యకి పెద్ద షాకే ఇది!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 09 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 9th (Image Credit: star maa/Disney + Hotstar)
1/8

మైత్రితో కలసి హర్ష సంతోషంగా రావడం చూసి నందిని బాధపడుతుంది. అదే విషయం నిలదీస్తుంది.. ఇది ఇలా రెచ్చిపోతే హర్షని నా సొంతం చేసుకునేందుకు ఎక్కువ కాలం పట్టదు అనుకుంటూ...హర్షని సపోర్ట్ చేస్తూ నందినిని మరింత రెచ్చగొడుతుంది మైత్రి.
2/8

నందిని నువ్వంటే ఎంతో ప్రేమ అని హర్షకి నేను నచ్చ చెబుతాలే అంటుంది. అసలు గొడవే నీవల్ల వచ్చింది..నా మొగుడి గురించి నాకే చెబుతున్నావ్ ఏంటి అసలు గొడవే నీవల్ల కదా అని ఫైర్ అవుతుంది నందిని. తన మాటలు పట్టించుకోవద్దంటూ ఇంట్లో అందరూ మైత్రికి సపోర్ట్ చేస్తారు
3/8

రూమ్ లో క్రిష్ కోసం ఎదురచూస్తుంటుంది సత్య..ఇంతలో ఎంట్రీ ఇచ్చిన క్రిష్ సంపంగీ..నీ బర్త్ డే డేట్ తెలిసిపోయిందోచ్ అంటూ చెబుతాడు. మల్లెపూలు తెచ్చుకోనా అంటే..అవసరం లేదంటుంది. మళ్లీ కొత్త కండిషన్లు పెడుతున్నావా ఏంటి అంటాడు క్రిష్. సత్య-క్రిష్ సంతోషం చూసి రుద్ర రగిలిపోతుంటాడు..
4/8

ఇంకో రెండు దినాలు దూరంగా ఉందాం నువ్వు చెప్పినట్టు ఆరాటం డబుల్ అయితాది కదా అంటాడు క్రిష్.. సత్య బుంగమూతి పెడుతుంది.
5/8

మైత్రి ఇంట్లో ఉండడానికి వీల్లేదు..నువ్వు బయటకు పంపిస్తావా నన్ను పంపించమంటావా...నా కోపం మైత్రి మీదనే అంటుంది నందిని. ఏం కారణం చెప్పాలని అడిగితే..నా పెళ్లానికి నీపై అనుమానం ఉంది అందుకే పంపిస్తున్నా అని చెప్పు అంటుంది. ఏడు రోజులు గడువు ఇచ్చావు కదా కొద్దిగా ఓపికపట్టు అంటాడు. నాకు మైత్రిపై అనుమానం పెరుగుతోంది అంటుంది.
6/8

ఈలోగా అటుగా వచ్చిన మైత్రి వాళ్లిద్దరి మాటలు వింటుంది. మైత్రి పైచదువులు చదువుకునేందుకు ఫారిన్ వెళుతుంది.. ఈ విషయం ఇంకా చెప్పలేదు రేపు చెబుతానంటాడు. నిన్ను వదిలిపెట్టి ఎలా వెళతాను అనుకున్నావ్ హర్షా ..ఈ గండం దాటాలి అనుకుంటుంది మైత్రి
7/8

తెల్లారి నిద్రలేచి క్రిష్ చాలా సంతోషంగా ఉంటాడు.. ఫస్ట్ నైట్ ఫస్ట్ క్లాస్ గా జరిగిందంటూ సంబరపడతాడు.. బాబోయ్ పరువు తీసేలా ఉన్నాడు అనుకుంటూ తలపట్టుకుంటుంది సత్య..
8/8

అక్కకి అబార్షన్ అయింది..ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరు అని సత్య చెబుతుంది... వారసుడిని చంపిన హంతకుడిని అరెస్ట్ చేసేందుకే పోలీసులు వచ్చారంటుంది...ఎవరది నేనే వాడిని చంపేస్తా అని ఫైర్ అవుతాడు మహదేవయ్య.. మీ పెద్ద కొడుకు రుద్ర అని షాక్ ఇస్తుంది సత్య...
Published at : 09 Oct 2024 08:36 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















