అన్వేషించండి
Satyabhama Serial Today January 25th Highlights: సంధ్యను మధ్యలో పెట్టి ఆట మొదలెట్టిన మహదేవయ్య ..సత్యకు కౌంట్ డౌన్ - సత్యభామ జనవరి 25 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 25th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

సంధ్యను ఎవరో రౌడీలు ఏడిపిస్తున్నారంట లొకేషన్ పంపించింది పద అంటుంది సత్య. క్రిష్ కూల్ గా కారు డ్రైవ్ చేస్తుంటాడు. త్వరగా పోనీ అంటుంది సత్య. ఆ ఫోన్ చేయించింది నేనే అంటాడు క్రిష్. మీ వదిన ప్రచారానికి వెళ్లకుండా అమ్మ ప్లాన్ చేసింది. అమ్మ కష్టడీ నుంచి మీ వదినని తప్పించేందుకు ఈ ప్లాన్ చేశా అంటాడు.
2/9

ప్రచారం భాగంగా ఊరంతా తిరుగుతుంటారు నందిని, సత్య. ఇంతలో బస్ స్టాప్ లో ఆకతాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తుంటారు. అడ్డుకున్న సత్యతో నేను మున్సిపల్ చైర్మన్ తాలూకా అంటూ బిల్డప్ ఇస్తాడు. సత్య లాగిపెట్టి కొట్టి చెప్పు చూపిస్తుంది.
3/9

ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాడు..అది బాగా వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి MLA అయితే ఊరు బాగుపడుతుంది అనుకుంటారంతా.
4/9

ఎవడినో సత్య కొట్టి వీడియో పెడితే వైరల్ అయిపోయింది..మనం మర్డర్ చేసి వీడియో పెడదాం అంటాడు రుద్ర.. మహదేవయ్య ఫైర్ అవుతాడు
5/9

తన గురించి తాను ఆలోచించుకునేవారు చుట్టూ ఉన్నవారికోసం ఆలోచించలేదు...సత్య మంచి పని చేసింది అనుకుంటారు తన పుట్టింటివారంతా. సత్య మంచి పని చేస్తోంది అనుకుంటారు. హర్ష కాల్ చేసి సత్యని అభినందిస్తాడు. ఆ విషయం సత్యకి చెప్పి హ్యాపీగా ఫీలవుతుంది నందిని
6/9

సంజయ్ బండిపై వెళుతున్న సంధ్యని చూస్తుంది సత్య.. కాల్ చేసి అడిగితే కంప్యూటర్ క్లాస్ కి వెళ్లాను ఇప్పుడే ఇంట్లోకి వెళుతున్నా అంటుంది. సంజయ్ బైక్ పై నిన్ను చూశాను అంటే తను లిఫ్ట్ ఇచ్చాడని అబద్ధం చెబుతుంది. తనకి దూరంగా ఉండు అని చెబుతుంది..హమ్మయ్య అనుకుంటుంది సంధ్య
7/9

మీడియా వాళ్లంతా సత్యను చుట్టుముడతారు.. వరంగల్ లో ఇలాంటి ధైర్యం ఎవరూ చేయలేదు అంటారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా అంటే.. దీనికి ఎన్నికలకు ముడిపెడతారని నాకు తెలుసు..సమాజంలో సమస్యల పట్ల ఇలాగే రియాక్టవుతాను ..ప్రచారం కోసం కాదు తోటి ఆడపిల్లల పట్ల బాధ్యత అనుకుని చేశానంటుంది
8/9

ఇలాంటి పనుల వల్ల మీకు హాని జరగొచ్చు అని మీడియా వాళ్లంటే.. ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానంటుంది.. ఆ మాటలు వింటారు మహదేవయ్య, రుద్ర , భైరవి...
9/9

సత్యభామ జనవరి 27 ఎపిసోడ్ లో... మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాల్సిన టైమ్ వచ్చింది..నువ్వు లేకుండా నేను బతకలేను అంటుంది సంధ్య. ఆ కాల్ సత్య లిఫ్ట్ చేసి షాక్ అవుతుంది. పెళ్లి జరగాలంటే మీ అక్క ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని కండిషన్ పెట్టు అంటాడు మహదేవయ్య..
Published at : 25 Jan 2025 07:40 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















