అన్వేషించండి
Telugu Indian Idol Season 3: 'ఇంద్ర'లో చిరంజీవి వీణ స్టెప్ వేసిన తమన్ - ఆయన డ్యాన్సులో గ్రేస్ చూశారా?
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లు ఇచ్చిన పెర్ఫార్మన్స్ కి మార్కులు వేయాల్సిన ఆయన స్టేజి మీద డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
చిరంజీవి వీణ స్టెప్ వేస్తున్న తమన్... చూస్తున్న సింగర్ శ్రీరామచంద్ర
1/5

సంగీత దర్శకుడిగా కంటే నటుడిగా ముందు తెరంగేట్రం చేశారు తమన్. శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్'లో నటించారు. పాటలకు డ్యాన్స్ చేశారు. నటన పక్కన పెట్టి... సంగీత దర్శకుడిగా బిజీ అయ్యాక ఆయన యాక్ట్ చేయలేదు. ప్రీ రిలీజ్ వేడుకల్లో సరదాగా కాలు కదిపిన సందర్భాలు తప్ప వేరేవి లేవు. అటువంటి తమన్ ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ చేశారు.
2/5

వీణ స్టెప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఏం సందేహం లేకుండా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. 'ఇంద్ర' సినిమాలోని 'దాయి దాయి దామ్మా' పాటలో ఆయన వేసిన వీణ స్టెప్ అంత పాపులర్ మరి.
Published at : 11 Sep 2024 02:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















