అన్వేషించండి
Aha OTT: అవార్డుల్లో ఆహా దూకుడు... బెస్ట్ రీజినల్ ఓటీటీతో బాలయ్య షోకి అవార్డు, ఇంకా ఎన్ని వచ్చాయంటే?
Nexa Streaming Academy Awards: ముంబైలో జరిగిన నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డుల వేడుకలో 'ఆహా' ఓటీటీ దూసుకు చూపించింది. బెస్ట్ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సహా 13 అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.

నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డుల్లో ఆహా దూకుడు
1/7

హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వీక్షకులను ఆకట్టుకుని విజయాలు సాధించిన వెబ్ సిరీస్, సినిమాలకు నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డులు అందజేసింది. ఇటీవల ముంబైలో ఈ వేడుక జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) భాగస్వామ్యంతో జరిగిన ఆ వేడుకలో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహా సత్తా చాటింది. మొత్తం 13 విభాగాల్లో సత్తా చాటింది.బెస్ట్ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అవార్డుతో పాటు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' బెస్ట్ నాన్ ఫిక్షన్ స్పెషల్ షో అవార్డు అందుకుంది. ఈ రెండు కాకుండా మరో 11 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.
2/7

'భామా కలాపం'కు గాను కథానాయిక ప్రియమణి 'బెస్ట్ యాక్టర్ - క్రిటిక్స్ ఛాయస్' అవార్డు అందుకున్నారు. ఆ సినిమా రచయిత అభిమన్యు తడిమేటి 'బెస్ట్ స్టోరీ' అవార్డు అందుకున్నారు.
3/7

'భామా కలాపం' సినిమాలో నటి శరణ్య సహాయ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆవిడ 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఫిల్మ్' అవార్డు అందుకున్నారు. దీంతో పాటు 'అన్యాస్ ట్యుటోరియల్' సిరీస్ కు గాను నివేదితా సతీష్ తో కలిసి 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ సిరీస్' అవార్డు కూడా శరణ్య ప్రదీప్ అందుకున్నారు.
4/7

ఆహా తమిళ్ ఓటీటీలో 'రచ్ఛసి' సినిమా 'బెస్ట్ ఫిల్మ్', 'బెస్ట్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్', అందులో హీరో కన్నా రవి 'బెస్ట్ యాక్టర్ మేల్ - క్రిటిక్స్ ఛాయస్', జగదీశ్ రవి 'బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డులు అందుకున్నారు.
5/7

'బెస్ట్ స్టోరీ' అవార్డుతో 'భామా కలాపం' రచయిత అభిమన్యు తడిమేటి
6/7

ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ 'న్యూసెన్స్'కు గాను బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అందుకున్న కిరణ్ మామిడి.
7/7

బెస్ట్ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అవార్డుతో ఆహా సీఈవో రవికాంత్ షబ్నవిస్ (Ravikant Sabnavis). బెస్ట్ నాన్ ఫిక్షన్ ఒరిజినల్ స్పెషల్ షోగా 'అన్‌స్టాపబుల్ 2'కు వచ్చిన అవార్డును సైతం ఆయన అందుకున్నారు.
Published at : 24 Jul 2024 10:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion