అన్వేషించండి
Varalaxmi Sarathkumar: నెట్టింట వైరల్ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు - చూశారా?
Varalaxmi Sarathkumar Wedding Photos: వరలక్ష్మి శరత్ కుమార్ తన స్నేహితుడు నికోలాయ్ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వరలక్మి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు
1/7

Varalaxmi Sarathkumar Wedding Photos: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వహకుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది.
2/7

ఇరు కుటుంబసభ్యులు, బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో థాయిలాండ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. బుధవారం జూలై 10న వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది.
3/7

ఆలస్యంగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడిఆయలో బయటకు వచ్చాయి. దీంతో వరలక్ష్మి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
4/7

దీంతో ఈ కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మార్చి 1న వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
5/7

ఈ పెళ్లి ఫోటోల్లో వరలక్ష్మి ఎరుపు రంగు చీర, ఒంటినిండ అందమైన ఆభరణాలతో మెరిసిపోగా.. సచ్‌దేవ్ క్రిం కలర్ పంచకట్టులో సంప్రదాయ లుక్‌లో కనిపించాడు.
6/7

సౌత్ ఇండియన్ సంప్రదాయంలో జరిగిన ఈ ళ్లికి థాయ్‌లాండ్‌కు చెందిన వీరి సన్నిహితులు కూడా హాజరయ్యారు.
7/7

అయితే ఇంకా వరలక్ష్మి కానీ, తన తండ్రి శరత్ కుమార్ నుంచి పెళ్లిపై అధికారిక సమాచారం రాలేదు. వరలక్ష్మి కూడా ఇంకా తన పెళ్లి ఫోటోలు షేర్ చేయకపోవడం గమనార్హం.
Published at : 11 Jul 2024 10:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















