Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
Andhrapradesh: టీడీపీలో 48 మంది ఎణ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. వారి తీరుపై కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. ఇంచార్జ్ మంత్రులు పట్టించుకోవాలన్నారు.

Cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రవర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యేల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పెన్షన్లు పంపిణీ చేయడం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారిపై చంద్రబాబు అసహనంతో ఉన్నారు. కేబినెట్ లో ఎజెండాపై చర్చ తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. వైజాగ్ సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీస్కుని పని చెయ్యాలన్నారు.
నారా లోకేష్ కూడా.. తొలి సారి ఎమ్మెల్యేలుగా గెేలిచిన వారికి మంచీ, చెడూ తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎక్కడి నుంచి వచ్చాము.. ఎలా ఎమ్మెల్యేలు అయ్యాము అన్నది మర్చిపోయి ప్రజలకు దూరం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేలలో ప్రజలను పట్టించుకోినివారితో పాటు.. వివాదాల్లో నిత్యం తలదూర్చేవారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారికి ఎన్ని సార్లు హెచ్చరికలు పంపినా వారు తీరు మార్చుకోవడం లేదు. ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతను ఇప్పుడు ఇంచార్జ్ మంత్రులకు ఇచ్చారు. రెండు మూడు నెలల తర్వాత ఆ ఎమ్మెల్యేలు దారికి వచ్చారా లేదా అన్నది పరిశీలించి .. చంద్రబాబు చర్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు సులభంగా అందుబాటులో ఉండి, పరిపాలనా వ్యవస్థను ముందుంచకపోతే ప్రభుత్వ లక్ష్యాలు సఫలం కావని హెచ్చరించారు. పెన్షన్ పంపిణీ, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో భాగం తీసుకోకపోవడం వల్ల 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. వారి వివరణలు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత కేబినెట్ సమావేశంలోనూ ఎమ్మెల్యేల పనితీరు పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించారని విమర్శలు వచ్చినా, టీడీపీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తుచేస్తూ చంద్రబాబు "ముందే మేల్కొని" చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ కాపాడటానికి, ప్రజలతో మార్గదర్శకత్వం వహించడానికి ఎమ్మెల్యేలు మారాలని సూచనలు ఇచ్చారు.
పాలిటికల్ లక్ష్మణ రేఖను ఎమ్మెల్యేలు దాటకుండా చూడాలని ఇంచార్జ్ మమంత్రులకు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు రాజకీయ సమన్వయంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా, ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యత వహించాలనే ప్రతిపాదన వచ్చింది. వెల్ఫేర్ కార్యక్రమాలు కేవలం అధికారిక కార్యక్రమాలు మాత్రమే కాదని, ప్రజలతో బంధాలు బలోపేతం చేసే అవకాశాలని గుర్తుచేశారు. టీడీపీ కార్మికులకు బీమా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించారు.





















