అన్వేషించండి
Karthikeya 2 100cr Celebrations : కార్తికేయ 2 విజయం తెలుగు సినిమా గొప్పదనం - నిఖిల్
నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరిందని చిత్ర బృందం సగర్వంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కర్నూలులో 'వందకోట్ల వసూళ్ల సంబరం' పేరుతో ప్రేక్షకుల సమక్షంలో భారీ వేడుక నిర్వహించింది.

'కార్తికేయ 2' వేడుకలో నిఖిల్
1/8

''రాజమౌళి గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకు వెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వల్లే 'కార్తికేయ 2'ను మేము ఇలా తీసుకు వెళ్లగలిగాం. ఇప్పుడు 1200 స్క్రీన్ లలో 'కార్తికేయ 2' ఆడుతుందంటే అది తెలుగు సినిమా గొప్పతనం'' అని నిఖిల్ అన్నారు.
2/8

'కార్తికేయ 2' వందకోట్ల వసూళ్ల సంబరం వేడుకకు ముఖ్య అతిథి టీజీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. ఈ సినిమా నిర్మాతలలో ఆయన సోదరుడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒకరు.
3/8

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ''మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది మొదటి వంద కోట్ల సినిమా. మా చిత్ర బృందానికి ప్రేక్షకులకు థాంక్స్'' అని అన్నారు.
4/8

''ప్రేమమ్, శతమానం భవతి' చిత్రాల తరువాత 'కార్తికేయ 2' నాకు ఒక మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అన్నారు.
5/8

''ఇటువంటి కథతో సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన నా తల్లిదండ్రులకు, నన్ను కొడుకులా చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదాలు. ఇవాళ నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్'' అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు.
6/8

'కార్తికేయ 2' వేడుకలో శ్రీనివాస రెడ్డి, అనుపమా పరమేశ్వరన్
7/8

''హీరో హీరోయిన్లు నిఖిల్, అనుపమ ఈ సినిమాకు నిర్మాతల వలే కష్టపడ్డారు. ఈ సినిమాలో ఎంత సస్పెన్స్ ఉందో... మాకు అలానే సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు'' అని సహా నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు.
8/8

'కార్తికేయ 2' వేడుకలో నిఖిల్
Published at : 27 Aug 2022 12:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
తిరుపతి
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion