అన్వేషించండి
Double Ismart First Single: 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సాంగ్ రిలీజుకు ముహూర్తం ఫిక్స్ - స్టెప్పా మార్ సందడి ఎప్పుడంటే?
Steppa Maar Song Release Date: 'డబుల్ ఇస్మార్ట్' సినిమా పాటలతో సందడి చేయడానికి ఉస్తాద్ రామ్ పోతినేని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లేటెస్టుగా అనౌన్స్ చేశారు.
![Steppa Maar Song Release Date: 'డబుల్ ఇస్మార్ట్' సినిమా పాటలతో సందడి చేయడానికి ఉస్తాద్ రామ్ పోతినేని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లేటెస్టుగా అనౌన్స్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/5496e93a7ec38852a7d9923b71ca47041719577603458313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో రామ్ పోతినేని
1/6
![ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/6a85c8c87b888e8a223dfba81b1b10a8235e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
2/6
!['డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'స్టెప్పా మార్' లిరికల్ వీడియో జూలై 1న విడుదల చేయనున్నట్లు పూరి కనెక్ట్స్ ప్రకటించింది. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఆయన ఛార్ట్ బస్టర్ ఆల్బంతో పాటు సూపర్బ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైతం మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/7b03aea7be1305d8a9c12a1ebdfc603d1099a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'స్టెప్పా మార్' లిరికల్ వీడియో జూలై 1న విడుదల చేయనున్నట్లు పూరి కనెక్ట్స్ ప్రకటించింది. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఆయన ఛార్ట్ బస్టర్ ఆల్బంతో పాటు సూపర్బ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైతం మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
3/6
!['డబుల్ ఇస్మార్ట్'లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున 'చంద్రలేఖ'లో ఆయన అతిథి పాత్రలో సందడి చేశారు. ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/69221b3306da47c0110d2f3b331a7f97f0d36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డబుల్ ఇస్మార్ట్'లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున 'చంద్రలేఖ'లో ఆయన అతిథి పాత్రలో సందడి చేశారు. ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది.
4/6
![ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. శంకర్ పాత్రలో రామ్ నటన, ఆ పాత్రను పూర్తి తీర్చిదిద్దిన తీరుకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/73c928848c201cc09d5557a7c708cfd9e7434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. శంకర్ పాత్రలో రామ్ నటన, ఆ పాత్రను పూర్తి తీర్చిదిద్దిన తీరుకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.
5/6
!['డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఇంకా శామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/b56e4d4ca9c2781f42f72bda47efba9c643ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఇంకా శామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
6/6
![రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలీ, గెటప్ శ్రీను ప్రధాన తారాగణం. సంజయ్ దత్ విలన్ రోల్. కేచ, రియల్ సతీష్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/9c781b2396407a383be58a6e2bea0a4fae3ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలీ, గెటప్ శ్రీను ప్రధాన తారాగణం. సంజయ్ దత్ విలన్ రోల్. కేచ, రియల్ సతీష్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.
Published at : 28 Jun 2024 06:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion