అన్వేషించండి
Bigg Boss Telugu 8 Sonia Akula: హౌజ్‌లో వివాదాలకు కేరాఫ్‌గా సోనియా ఆకుల - ఆ మాజీ కంటెస్టెంట్స్‌తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
Trolls on Sonia Akula: బిగ్‌బాస్ సోనియా ఆకులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొదటి నుంచి గొడవలు, వివాదాలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Image Credit: sheissoniaakula/Instagram
1/9

Bigg Boss 8 Telugu Sonia Akula Photos: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సోనియా ఆకుల. తెలంగాణకు చెందిన ఈ భామ రైతు కుటుంబం నేపథ్యంలో నుంచి ఈ స్థాయికి చేరుకుంది.
2/9

కరోనా వైరస్, దిశ మూవీ చిత్రాల్లో లీడ్ రోల్ పోషించింది సోనియా. అంతకు ముందు వరకు పెద్దగా ఎవరికి పరిచయం లేని ఆమె బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది.
3/9

హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు అందరితో స్నేహం ఉంటూ ప్రేమను సంపాదించుకుంటానంటూ హోస్ట్ నాగార్జునతో మాటలు చెప్పిన సోనియా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వస్తుంది.
4/9

మొదటి నుంచి చిన్న చిన్న విషయాలకు కూడా గోడవలు పడుతూ కంటెంట్ ఇస్తున్నాననుకుంటుంది. ప్రతి ఒక్కరితో వితండవాదం చేస్తూ ఫుల్ నెగిటివిటీని మూటగట్టకుంటుంది. ముఖ్యంగా విష్ణుప్రియపై ఆమె చేస్తున్న అనుచిత కామెంట్స్, గొడవలు ఆడియన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
5/9

అలా టాస్క్‌ల కంటే కూడా కంటెస్టెంట్స్‌తో గొడవ పడటంపైనే ఆమె ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో సోనియాను సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
6/9

ఇక హౌజ్‌లో నిఖిల్,పృథ్వీరాజ్‌లతో అతిసన్నిహిత్యం కూడా ఆమెకు నెగిటివిటీ వస్తుంది. దీంతో సోనియాను శోభా శెట్టి 2.0 అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్,పృథ్వీలతో చేస్తున్న ఓవరాక్షన్ ఆడియన్స్‌కి అసలు నచ్చడం లేదు.
7/9

అలా మొదటి నుంచి ఫుల్ నెగిటివిటీ సోనియా హౌజ్‌లో అందరి కంటే ఎక్కువగా హాట్‌టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఆటాడేసుకుంటున్నారు. ఆమె వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మండిపడుతున్నారు.
8/9

హౌజ్‌లో వరస్ట్ పర్ఫామర్ అని, ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తీరు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా తప్పుబడ్డారు. విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదంటూ ఆమె చేసిన కామెంట్స్ అసలు సహించరాదని, ఈసారి హోస్ట్ నాగార్జున గారు ఆమెను గట్టిగా మందలించాల్సిందేనంటూ రివ్యూ ఇచ్చారు.
9/9

ఇలా తన తీరుతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సోనియాను ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున ఎలా మందలిస్తారో చూడాలి.
Published at : 14 Sep 2024 03:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion