అన్వేషించండి
Chandra Grahan 2025: చంద్ర గ్రహణానికి 1 రోజు ముందు ఈ 4 రాశుల వారి జీవితాల్లో గ్రహణం!
Chandra Grahan 2025 Date: చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం ఏర్పడుతోంది. రాహువు దోషం వలన కొన్ని రాశుల వారికి కష్టాలు మొదలవుతాయి..ముఖ్యంగా ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Chandra Grahan 2025
1/7

సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అయితే గ్రహణానికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 6న రాహువు చంద్రుడు శని ఒకే రాశిలో కలయికతో గ్రహణ యోగం ఏర్పడుతుంది.
2/7

గ్రహణ యోగం సూర్యుడు, చంద్రుడు , రాహు-కేతు ఒకేసారి లేదా ఒకరి ప్రభావంలోకి రావటం వలన ఏర్పడుతుంది, దీనివల్ల కొందరి జీవితంలో మానసిక అస్థిరత, భావోద్వేగ హెచ్చు తగ్గులు, వృత్తిపరమైన ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
3/7

చంద్ర గ్రహణం ముందు ఏర్పడుతున్న ప్రమాదకరమైన గ్రహ యోగం ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది. అనవసరంగా వివాదంలో చిక్కుకుంటారు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. చట్టపరమైన విషయాలకు దారి తీయవచ్చు.
4/7

మీన రాశి వారికి గ్రహణ యోగం ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు తగ్గించండి. కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోవద్దు
5/7

చంద్రుడు రాహువుతో కలిస్తే మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు అనవసర వాదనలకు దిగే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి విషయాలకు దూరంగా ఉండండి. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి.
6/7

కన్యా రాశి వారు వృత్తిపరమైన విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడవద్దు, గ్రహణ యోగం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
7/7

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
Published at : 03 Sep 2025 10:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















