ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో సాయం చేస్తున్నామని, మొత్తం 5,97,311 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నేల కోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిచామని, దీంతోపాటుగా నేడు 1220 రైతు గ్రూప్ లకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు చెల్లించామని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 542.06 కోట్లు, వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు మొత్తం కలిపి రూ. 571.57 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ జమ చేశారు.
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రాయలసీమలో కూడా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఏపీలోని అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. వారికి పరిహారం అందిస్తూ తోడుగా నిలిచామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
నేను సీఎంగా బాధ్యతలు చేప్పట్టిననాటి నుండి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ. 1612 కోట్లు సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం - సీఎం వైయస్ జగన్
TRS Dharna At Delhi: తెలంగాణ వడ్లు కొనాలంటూ దిల్లీలో కేసీఆర్ అండ్ కో ధర్నా
TRS VS BJP: కేంద్రంలోని బీజేపీ సర్కార్ వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్‌కు వెరైటీ స్వాగతం
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!