Twitter Claims 'Zero-Tolerance Approach: ట్విట్టర్‌పై రాహుల్ గాంధీ ఫిర్యాదు.. అలాంటిదేం లేదని సంస్థ జవాబు
ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సంస్థ ఖండించింది. అలాంటిదేం లేదని వివరణ ఇచ్చింది.
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సంస్థ స్పందించింది. కావాలనే ట్విట్టర్‌లో తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను సంస్థ ఖండించింది.
We fight spam and malicious automation strategically and at scale with machine learning tools, and as part of those consistent and ongoing efforts to ensure a healthy service and credible accounts, follower counts can and do fluctuate: Twitter Spokesperson (2/3)
— ANI (@ANI) January 27, 2022
రాహుల్ లేఖ..
ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యేవారి సంఖ్య ఈ మధ్య బాగా తగ్గిందని, తాను చేసే ట్వీట్లు కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం లేదని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఒక్కసారిగా తనను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రాహుల్ ఆరోపించారు.
Congress leader Rahul Gandhi wrote to Twitter CEO Parag Agrawal on 27th December 2021, stating that "it is perplexing that the growth in my Twitter followers has suddenly been suppressed." pic.twitter.com/xhbT1UWxXh
— ANI (@ANI) January 27, 2022
2021 ఆగస్టులో దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో వారితో దిగిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమని ఆయన ఖాతాను వారం పాటు ట్విట్టర్ నిషేధించింది.
అయితే దీనిపై కూడా రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. తాను ట్వీట్ చేసిన ఫొటోలను ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలతో పాటు మరికొందరు కూడా ట్వీట్ చేశారని రాహుల్ అన్నారు. అయినా వాటిని మాత్రం బ్లాక్ చేయకుండా నన్నే టార్గెట్ చేశారని ఆరోపించారు.
Also Read: Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి