అన్వేషించండి

YS Sharmila News: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం - ముహూర్తం ఖరారు.?

Ysrtp Merge With Congress: వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం.

YS Sharmila Merge Party With Congress: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో షర్మిల హస్తం పార్టీలో ఈ నెల 4న (గురువారం) చేరనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అందుబాటులోని పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రోజులు ఓపిక పడితే అన్ని విషయాలపైనా క్లారిటీ వస్తుందని షర్మిల చెప్పారు. కాగా, గురువారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా  షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళి అర్పించనున్నారు.

కీలక పదవి

అన్ని విషయాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని షర్మిల వెల్లడించారు. తనతో కలిసి నడుస్తానన్న ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న షర్మిల.. తెలంగాణ ఇవ్వడం వల్లే ఏపీలో కాంగ్రెస్ నష్టపోయిందని అన్నారు. ఏఐసీసీ పదవి చేపడితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందన్న నేతల వాదనతో ఆమె ఏకీభవించారు. తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని, ఇందులో భాగంగానే షర్మిలకు కీలక పదవి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు, వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. పార్టీ నేతలకు కీలక పదవులు ఉంటాయని షర్మిల స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సమావేశం అనంతరం షర్మిల కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి నివాళి అర్పిస్తారు. 

Also Read: AP Sanitation Workers Strike: మున్సిపల్‌ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget