Top Headlines Today: ప్లాన్ బీ అమలు యోచనలో మాజీ సీఎం జగన్, తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - నేటి టాప్ న్యూస్
YSR 75th Birth Anniversary Latest News 8 July 2024: ఏపీలో ఉచిత ఇసుక పాలసీ, వైఎస్సార్ 75వ జయంతి సహా నేటి ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.
Dr YS Rajasekhara Reddy 75th Birth Anniversary - ప్లాన్ బీ అమలు యోచనలో మాజీ సీఎం జగన్ - ఇక ఢిల్లీ కేంద్రంగానే రాజకీయమా ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన మళ్లీ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వైసీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. వైసీపీ ఎల్పీ నేతగా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు. ప్రతిపక్ష నేత హోదాను స్పీకర్ ఇస్తే ఆయన అసెంబ్లీకి వద్దామనుకుంటన్నారని లేకపోతే లేదని గతంలో విడుదల చేసిన లేఖ ద్వారా రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఒక్క ఫోన్ కాల్‌తో కొడవలి పట్టి బయలుదేరిన మంత్రి నిమ్మల - ఆ వెనుకే అనుచరులు, ఏం చేశారంటే?
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఒక్క ఫోన్ కాల్‌కు స్పందించారు. ఓ సంకల్పంతో కొడవలి చేతబట్టి బయలుదేరగా బయలుదేరగా ఆయన వెంట అనుచరులు సైతం దండులా కదిలారు. తాము సైతం అంటూ ఆయనతో పాటు శ్రమదానంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని (Palakollu) టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం మంత్రి శ్రమదానం చేశారు. స్వయంగా పార, పలుగు పట్టి అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను సైతం తొలగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను (Telangana Corporation Chairmans) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన జీవోను మార్చి 15నే సర్కారు విడుదల చేయగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా పదవుల భర్తీలో జాప్యం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
మహిళా సాధికారత దిశగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో మహిళా సంఘాల(Dwakra Groups)తో తెలంగాణ వంటకాల అమ్మకం దుకాణాలు ప్రారంభించిన ప్రభుత్వం...గ్రామీణ మహిళల ఆదాయ వనరలు పెంచే దశగా చర్యలు చేపట్టింది. వారితో నాటుకోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించనుంది. బ్యాంకుల ద్వారా వారికి ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇడుపులపాయలో వైఎస్ జయంతి వేడుకలు- పాల్గొన్న జగన్, విజయమ్మ, భారతి, వైసీపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇడుపులపాయలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వైసీపీ అధినేత జగన్, విజయమ్మ, భారతితోపాటు వైసీపీ లీడర్లు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి