ఆహారం అందిస్తుండగా దాడి చేసిన సింహం, ప్రాణాలు కోల్పోయిన జూ కీపర్
Zookeeper Dead: జపాన్‌లోని ఓ జూలో జూకీపర్‌పై సింహం దాడి చేసి చంపింది.
Zookeeper Dead:
జపాన్‌లో ఘటన..
జపాన్‌లో ఓ జూలో జూ కీపర్ సింహానికి బలైపోయాడు. ఫుకుషిమాలోని Tohoku Safari Parkలో ఈ ఘటన జరిగింది. సింహానికి ఆహారం అందించేందుకు వెళ్లిన సమయంలోనే అది ఒక్కసారిగా దాడి చేసింది. ఆ ఎన్‌క్లోజర్‌లోనే రక్తపు మడుగులో పడిపోయాడు జూ కీపర్. జూ సిబ్బంది గుర్తించి వెంటనే బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించింది. అప్పటికే తీవ్ర గాయాల పాలైన జూకీపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చాలా ఏళ్లుగా ఈ జూలో పని చేస్తున్న కెనిషీ కటో (Kenichi Kato) సింహానికి ఫుడ్ వేసే క్రమంలో ఓ ఎన్‌క్లోజర్‌కి ఉన్న సెకండ్ డోర్‌కి తాళం వేయడం మరిచిపోయి ఉంటాడని అందుకే సింహం దాడి చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సింహానికి ఆహారం అందించినప్పుడు ఓ డోర్‌లో నుంచి వెళ్లి మరో డోర్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఓ డోర్‌కి తాళం వేస్తే కానీ..సింహం జూకీపర్‌పై దాడి చేసే వీల్లేకుండా ఉంటుంది. కానీ...కటో మాత్రం తాళం వేయలేదని అనుమానిస్తున్నారు. అక్కడి ఉద్యోగులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
"సాధారణంగా మేం సింహానికి ఆహారం అందించే క్రమంలో ఎన్‌క్లోజర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి అక్కడ ఫుడ్ పెట్టేస్తాం. ఒక్కసారి అక్కడ ఫుడ్ పెట్టిన తరవాత వెంటనే డోర్ మూసేసి లాక్ వేస్తాం. కానీ...ఇప్పుడా డోర్ తెరిచే ఉంది. బహుశా కెనిషీ కటో డోర్‌కి తాళం వేయడం మర్చిపోయి ఉండొచ్చు. అందుకే సింహం దాడి చేసింది"
- జూ సిబ్బంది
క్షమాపణలు చెప్పిన జూ యాజమాన్యం..
ఈ ఘటన తరవాత జూని తాత్కాలికంగా మూసివేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా సేఫ్‌టీ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టనున్నారు. మృతుని కుటుంబ సభ్యులకి జూ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకెవరికీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడతామని హామీ ఇచ్చింది.
గతేడాది అమెరికాలోని మిన్నెసొటలోని జూలో ఒంటె జూ ఓనర్ తలను కొరికింది. అలాగే నోటితో పట్టుకుని అతడిని కొద్ది దూరం పాటు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బ్లెంకర్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఒంటెను సరకు రవాణా కోసం వినియోగించాలని భావించాడు. అందుకోసం అవసరమైన శిక్షణ ఇస్తున్నాడు. అప్పటి వరకూ బాగానే ఉన్న ఒంటె ఒక్కసారిగా అతని తలను గట్టిగా కొరికింది. దాదాపు 15 అడుగుల వరకూ లాక్కెళ్లి పడేసిందని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. ఒంటె పళ్లు తలపై లోతుగా దిగినట్టు తెలిపింది. ఒంటె దాడి చేయటాన్ని చూసిన ఓ ఉద్యోగి వెంటనే పరిగెత్తుకుని వచ్చి బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. చాలా సేపటి వరకూ ఒంటె బాధితుడి తలను అలాగే కొరికి పట్టుకుంది. చివరకు ఓ ప్లాస్టిక్ వాకింగ్ బోర్డ్ సాయంతో అతని తలను బయటకు తీశాడు. కాపాడటానికి వెళ్లిన వ్యక్తిపైనా ఒంటె దాడి చేసింది. చేతులపైనా, తలపైనా గట్టిగా కొరికింది. ఏదో విధంగా చాలా సేపు పోరాడి ఒంటె దాడి నుంచి తప్పించుకున్నాడా వ్యక్తి.
Also Read: చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం