అన్వేషించండి

US-Iran Ceasefire:హర్మూల్‌ జలసంధిలో టోల్ వసూళ్లు! వ్యాపారం మొదలెట్టిన ట్రంప్‌!

US-Iran Ceasefire:అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వేళ హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఉమ్మడి టోల్ వసూలు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హర్మూజ్ జలసంధిలో టోల్ వసూళ్లకు అమెరికా-ఇరాన్ ఉమ్మడి ప్రణాళిక.
  • ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రతిపాదన.
  • ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఆదాయం అధికం.
  • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ నాయకుడు కుమారుడు కీలక పాత్ర.

US-Iran Ceasefire:అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఒక సంచలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. వాషింగ్టన్‌, టెహ్రాన్ మధ్య రెండు వారాల యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసేందుకు ఇరాన్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీనిని ఆయన ఒకక అద్భుతమైన విషయంగా అభివర్ణించారు. 

బుధవారం నాడు జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా" మేం దీనిని జాయింట్ వెంచర్‌గా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది మా మార్గాన్ని సురక్షితం చేయడానికి, ఇతర వ్యక్తుల నుంచి దీనిని కాపాడటానికి ఒక మార్గం" అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. 

ఈ ప్రణాళిక అమలులోకి వస్తే పర్షియన్ గల్ఫ్‌ , హిందూ మహాసముద్రాన్ని కలిపే ఈ వ్యూహాత్మక జలసంధిపై అమెరికా నేరుగా సైనిక నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. ఈ మార్గం ప్రధానంగా ఒమన్, ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ఉన్నందున, అమెరికా సైనిక ఉనికి అక్కడ అనివార్యమవుతుంది. 

హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైంది. షిప్పింగ్ పరిశ్రమ నివేదికల ప్రకారం ఈ మార్గం గుండా ప్రతి రోజూ సుమారు 120 నౌకలు ప్రయాణిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్ ఇప్పటికే కొన్ని నౌకల నుంచి ఒక్కో ప్రయాణానికి రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ వసూలు చేస్తోందని సమాచారం. ఒక వేళ ట్రంప్ ప్రతిపాదించినట్టు  అమెరికా కూడా అదే స్థాయిలో ఫీజు వసూలు చేస్తే రోజుకు సగటున 240 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. 

ఈ ప్రతిపాదన వెనుక ఉన్న రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ చాలా క్లిష్టమైంది. ఇరాన్ ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో డ్రోన్‌, క్షిపణి దాడులు కొనసాగిస్తున్నప్పటికీ ఆ దేశం సైనికంగా ఓడిపోయిందని ట్రంప్ ప్రకటించారు. " మేమే విజేతలం, వారు సైనికంగా ఓడిపోయారు. కేవలం నీటిలో కొన్ని మైన్లు వేస్తామనే మానసిక యుద్ధం మాత్రం వారి వద్ద మిగిలి ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇరాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు జరిగాయని, అలాగే కువైట్‌, యూఏఈలపై ఇరాన్ దాడులు చేసినట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడం, ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖమేనీ కుమారుడు ముజ్తాబా ఖమేనీ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Frequently Asked Questions

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ ప్రతిపాదన ఏమిటి?

హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేయడానికి ఇరాన్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.

ఈ జాయింట్ వెంచర్ ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?

ఈ జాయింట్ వెంచర్ ద్వారా వాణిజ్య మార్గాలను సురక్షితం చేయడానికి మరియు ఇతర దేశాల నుండి రక్షించడానికి ట్రంప్ భావిస్తున్నారు.

హర్మూజ్ జలసంధి ప్రాముఖ్యత ఏమిటి?

ఈ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో చాలా కీలకం. ప్రతిరోజూ సుమారు 120 నౌకలు దీని గుండా ప్రయాణిస్తాయి.

ఇరాన్ ఇప్పటికే ఈ మార్గం నుండి టోల్ వసూలు చేస్తోందా?

కొన్ని నివేదికల ప్రకారం, ఇరాన్ ఇప్పటికే కొన్ని నౌకల నుండి ఒక్కో ప్రయాణానికి రెండు మిలియన్ డాలర్ల వరకు వసూలు చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget