అన్వేషించండి

Iran-US Conflict: అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మధ్య ఉద్రిక్తత!ఇరాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి!

Iran-US Conflict: అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌లోని లావన్‌ ద్వీపంలో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
  • ఒప్పందం అమల్లోకి వచ్చాక లావన్ ద్వీపంలో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగింది.
  • హర్మూజ్ జలసంధిని ఇరాన్ సురక్షితంగా తెరవడానికి అంగీకరించింది.
  • పాకిస్తాన్ కీలక మధ్యవర్తిత్వంతో ఈ శాంతి చర్చలు ఫలించాయి.

Iran-US Conflict: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ మధ్య మంగళవారం ఒక చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పంద కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై భారీ బాంబు దాడులు చేస్తామని ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించిన వేళ ఆ ఒప్పందం ఒక ఊరటగా నిలిచింది. అయితే ఈ ఒప్పంద అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే అంటే బుధవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం పది గంటలకు ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో చమురు శుద్ధి కర్మాగారంపై శత్రు దేశం దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. 

నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది , భద్రతా బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. నాసా శాటిలైట్ చిత్రాలు కూడా లావన్ ద్వీపంలో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి ఉండగానే ఈ దాడి జరగడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఇరాన్ కూడా కువైట్,యూఏఈ వంటి గల్ఫ్ అరబ్‌ దేశాలపై దాడులు చేసినట్టు నివేదికలు అందుతున్నాయి. 

ఒప్పందంలోని ముఖ్యాంశాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని వాషింగ్టన్‌ సాధించిన సంపూర్ణ విజయంగా అభివర్ణించారు. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే సురక్షితంగా తెరిచేందుకు అంగీకరించింది. అమెరికా రెండు వారాల పాటు ఇరాన్‌పై ఎటువంటి దాడులు చేయదు. ఒప్పందం కాలంలో ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను సురక్షితంగా పర్యవేక్షించేలా ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. 

వివాదానికి అసలు కారణం ఏంటీ?

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యను సమర్థిస్తూ, ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కోసమే యురేనియంను సుసంపన్నం చేస్తోందని ఆరోపించింది. అయితే ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ ఈ ఆరోపణలను ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ కూడా దీనిని ఖండిస్తూనే ఉంది. గతంలో అమెరికా పెట్టిన కఠిన నిబంధనలను అంటే క్షిపణి కార్యక్రమం నిలిపివేత, ఉగ్రవాద సంస్థలకు మద్ధతు ఉపసంహరణ వంటివి ప్రస్తుత తాత్కాలిక ఒప్పందంలో పేర్కొనలేదు. 

ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ పాకిస్తాన్‌పై నమ్మకం ఉంచడం ఈ ఒప్పందాన్ని మార్గం సుగమం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖమేనీ కుమారు ముజ్తబా ఖమేనీ కూడా ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో తెరవెనుక కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. 

ఒకవైపు కాల్పుల విరమణను ఇరాన్ వేడుకగా జరుపుకుంటున్నా, అమెరకా, ఇజ్రాయెల్ చర్యల పట్ల అక్కడ తీవ్ర అపనమ్మకం కొనసాగుతోంది. బిలియనీర్ పెట్టుబడిదారు రే డాలియో వంటి వారి ఈ ఘర్షణలను ప్రపంచయుద్ధంగా అభివర్ణిస్తూ ఈ పరిస్థితిలో చైనా, రష్యాలే విజేతలుగా నిలిచారని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల ప్రపంచ చమురు ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ, లావన్ ద్వీపంపై జరిగిన దాడి ఈ శాంతిని ఎంత కాలం నిలబెడుతుందనేది వేచి చూడాలి. ట్రంప్‌ తన వ్యూహాన్ని నిరంతరం మారుస్తూనే ఉన్నారు. గత నెలలో నిస్సందేహమైన లొంగుబాటు కావాలన్న ఆయన, ఇప్పుడు రెండు వారాల కాల్పుల విరమణ అంగీకరించారు. 

Frequently Asked Questions

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మంగళవారం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే అంటే బుధవారం ఉదయం ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగింది.

లావన్ ద్వీపంలో జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగిందా?

లేదు, లావన్ ద్వీపంలో జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఏమి చేయడానికి అంగీకరించింది?

ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే సురక్షితంగా తెరిచేందుకు అంగీకరించింది. అలాగే, ఒప్పంద కాలంలో తన వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను సురక్షితంగా పర్యవేక్షించేలా ఇరాన్ అంగీకరించింది.

ఈ శాంతి చర్చల్లో ఏ దేశం కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది?

ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. అమెరికా, ఇరాన్ రెండూ పాకిస్తాన్‌పై నమ్మకం ఉంచడం ఈ ఒప్పందానికి మార్గం సుగమం చేసిందని ప్రచారం జరుగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget