అన్వేషించండి

US Iran War: పాక్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌కు కొత్త డెడ్‌లైన్.. 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై రెండు వారాలపాటు కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.

Donald Trump Announces Ceasefire Iran:: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం 2 వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై భారీ దాడి చేస్తామని, మొత్తం నాగరికతనే అంతం చేస్తామ్న కొన్ని గంటలకే ఆయన కాల్పుల విరమణ ప్రకటన చేశారు.  ఈ సీజ్‌ఫైర్ ఒప్పందంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సైనిక చర్య కోసం ముందే నిర్ణయించిన గడువుకు గంట ముందు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 

హర్మూజ్ రీఓపెన్ కు మరో గడువు ఇచ్చిన ట్రంప్ 

‘ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయాలని నేను నిర్ణయించుకున్నాను. శత్రుత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించడానికి ఇరాన్ నిర్ణయం తీసుకోవడంపై మా నెక్ట్స్ స్టెప్ ఉంటుంది.  

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తిరిగి తెరవడానికి అంగీకరిస్తేనే మేం కాల్పులు, దాడులపై వెనక్కు తగ్గుతాం. దాంతో రెండు వైపులా కాల్పుల విరమణ జరుగుతుంది. ఇప్పటికే అన్ని సైనిక లక్ష్యాలను సాధించాం. ఇరాన్‌తో శాశ్వత శాంతి,  మధ్యప్రాచ్యంలో స్థిరత్వం కోసం ఒక ఒప్పందం చేసుకోవడంలో మేం బాగా ముందుకు వెళ్తున్నాం. ఇరాన్ 10 పాయింట్ల ప్లాన్ సమర్పించింది.  ఇది చర్చలకు ఆచరణాత్మక పునాదిని అందిస్తుందని భావిస్తున్నానని’ ట్రంప్ అన్నారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కీలక పాత్ర 

షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌తో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సంయమనం పాటించాలని, బలగాలను ఉపయోగించడాన్ని వాయిదా వేసుకోవాలని పాక్ కోరినందుకు ఆయన వారి పాత్రను అంగీకరించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో చర్చల తర్వాత ఇరాన్‌పై షెడ్యూల్ చేసిన విధ్వంసక దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ వివరించారు.

శాంతి ఒప్పందం దిశగా అడుగులు
ఇరాన్ వైపు నుంచి వస్తుందన్న స్పందనపై ట్రంప్ ఆశాభవం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చాలా వివాదాస్పద అంశాలు ఇప్పటికే పరిస్కారం అయ్యాయని పేర్కొన్నారు. రెండు వారాల విరామం సమగ్ర ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటామన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు అన్ని విభేదాలు పరిష్కరించుకుని ఒప్పందంపై సంతకం చేయడానికి ఈ 2 వారాల సమయం వీలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా, మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధిగా, ఈ దీర్ఘకాలిక వివాదం పరిష్కారానికి దగ్గర కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ నివేదించిన 10 పాయింట్ల ప్రణాళిక ఆధారంగా ప్రతిపాదిత ఒప్పందం, ఈ ప్రాంతంలోని రాజకీయ ప్రత్యర్థులలో ఒకరిని తగ్గించడంలో కీలక పురోగతిగా పేర్కొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
Hormuz close: హార్మోజ్ నిన్న తెరిచారు.. ఇవాళ మూసేశారు - అమెరికా తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
హార్మోజ్ నిన్న తెరిచారు.. ఇవాళ మూసేశారు - అమెరికా తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
Strait of Hormuz:
"హర్మూజ్‌ జలసంధి మూసివేస్తాం" శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ వార్నింగ్! ట్రంప్ తీరుపై ఆగ్రహం!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Embed widget