US Capitol Riot Hearing: తండ్రిపై ఇవాంకా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
US Capitol Riot Hearing: యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అటుఇటూ తిరిగి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుట్టుకుంది. ఇవాంకా ట్రంప్.. తన తండ్రి ట్రంప్‌పై ఆరోపణలు చేసింది.
US Capitol Riot Hearing: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు చుట్టుకుంది. అమెరికాలో అత్యంత కీలకమైన ప్రదేశాల్లో ఒకటైన క్యాపిటల్ బిల్డింగ్‌పై 2021 జనవరి 6న ట్రంప్ మద్దతు దారులు దాడికి దిగారు. దానికన్నా ముందే జో బైడెన్ గెలుపు దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ కొన్ని విద్వేష పూరిత రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ప్రెసిడెంట్‌గా తనను తప్పించేందుకు కుట్ర జరిగిందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత క్యాపిటల్ భవనంపైకి పెద్ద ఎత్తున ట్రంప్ మద్దతు దారులు దాడికి దిగారు. ఆ తర్వాత చాలా సేపటికి కానీ ఆ గొడవలు సద్దుమణగకపోవటంపై అధికారంలోకి వచ్చిన తర్వాత డెమొక్రాటిక్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
— January 6th Committee (@January6thCmte) June 10, 2022
విచారణ
జనవరి 6న ఏర్పాటైన న్యాయ విచారణ కమిటీ ఏడాది పాటు విచారణ సాగించింది. అనంతరం గురువారం రాత్రి కొన్ని కీలక వీడియోలను విడుదల చేసింది. వాటిలో ట్రంప్ సన్నిహితులుగా ఉన్న వారి నుంచి జరిగిన విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక్ ట్రంప్ కూడా డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఎన్నికలు కుట్రపూరితంగా జరిగాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అవాస్తమనని అటార్నీ జనరల్ బ్రార్ చేసిన వ్యాఖ్యలను రెస్పెక్ట్ చేస్తున్నట్లు ఇవాంక్ ట్రంప్ చెప్పిన వీడియోను విచారణ కమిటీ విడుదల చేసింది. ఛైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మిల్లే కూడా తన టెస్టిమెనీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదేశాలు ఇవ్వలేదు
క్యాపిటోల్ బిల్డింగ్‌పై దాడి జరుగుతుందని చెప్పినా ట్రంప్ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని అప్పటి త్రివిధదళాధిపతి పేర్కొన్నారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రమే నేషనల్ గార్డ్స్‌ను పంపేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ వీడియోతో ఇంకా ట్రంప్ ఇన్నర్ సర్కిల్‌లో ఉన్న నాటి ప్రముఖుల వీడియోలను జనవరి 6 కమిటీ విడుదల చేసింది. దీంతో పాటు ఈ విచారణను మరింత వేగవంతం చేస్తున్నామని అమెరికాలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా జరిగిన కుట్రలపై ప్రజలకు సమాధానాలు చెబుతామని జవనరి 6న కమిటీ ట్వీట్ చేసింది.
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ కరోనా టెర్రర్- కొత్తగా 8582 కొవిడ్ కేసులు