అన్వేషించండి

Mamatha Benerjee Call to KCR: సీఎం కేసీఆర్‌కు మమతా బెనర్జీ లెటర్, ఫోన్ - కేంద్రాన్ని ఢీకొట్టేందుకు విపక్షాల సరికొత్త ఎత్తుగడ !

Mamatha Benerjee Call to CM KCR: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించారు.

Mamatha Benerjee Call to CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఫోన్‌ చేసి మాట్లాడారు. జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్డీఏయేతర, ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఇటీవల సీఎం కేసీఆర్ తీసుకున్న కొత్త జాతీయ పార్టీ నిర్ణయంపై మమత సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీని కేంద్రంలో గద్దె దింపాలన్నదే వీరి ఉమ్మడి లక్ష్యాల్లో ఒకటి కనుక.. బీజేపీని ఓడించేందుకు కొత్త పార్టీల అవసరం ఉందని మమత తన అభిప్రాయాన్ని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఈనెల 15న ప్రతిపక్ష పార్టీల సీఎంలు, ఇతర కీలక నేతల సంయుక్త సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ సహా మరో ఏడు రాష్ట్రాల సీఎంలకు మమత లేఖలు రాశారు. 

కలిసికట్టుగా విపక్షాలు.. 
దేశాన్ని పీడిస్తున్న సమస్య బీజేపీ అని, కేంద్రంలోని ఎన్డీయేకు అడ్డుకట్ట వేయాలనే దిశగా విపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కొత్త పార్టీ (భారతీయ రాష్ట్రీయ సమితి) ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అభినందించారు. జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేయనున్న సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజురోజుకూ తగ్గిపోవడంతో తాను ప్రత్యామ్నాయంగా మారుతూ చొరవ తీసుకున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్..
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపి, బీజేపీకి అడ్డుకట్ట వేయాలని సీఎం కేసీఆర్‌తో మమత చర్చించారు. దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై సైతం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆఎల్డీ, జేడీఎస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC), శిరోమణి అకాలీదళ్‌, పీడీపీ తదితర పార్టీల నేతలకు ఢిల్లీలో సమావేశం అవుతామని మమత లేఖల ద్వారా ఆహ్వానించారు. 

అయితే ఏపీ నుంచి అటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగానీ, ఇటు చంద్రబాబునాయుడు, తెలంగాణలో అసదుద్దీన్‌ ఒవైసీల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. శరద్‌పవార్‌, దేవెగౌడలాంటి సీనియర్ నేతలను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిని ఎదుర్కోవాలంటే విపక్షాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది.

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget