Ukraine Crisis Viral Photo: రష్యా ఉక్రేనియన్ జెండాలతో జంట, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ukraine Crisis Viral Photo: ఒక ఫొటో వియాత్నం యుద్ధాన్ని ఆపిందంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో హృదయాల్ని కలచివేసే ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Ukraine Crisis Viral Photo: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా సైనిక దాడి చేస్తుంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో(Social Media) విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు మానవాళిని కలచివేస్తున్నాయి. రష్యా దాడిని ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో మేసేజ్ లు పెడుతున్నారు. తమ భావోద్వేగాలను సోషల్ మీడియా పంచుకుంటున్నారు. ఉక్రెయిన్‌లోని భూగర్భ మెట్రో స్టేషన్(Under Ground Metro Station) లో వీడ్కోలు చెప్పుకుంటున్న జంట ఫోటోల నుంచి తండ్రి కుమార్తె ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతూ అనేక హృదయాలను కదిలిస్తున్నాయి.
శశిథరూర్ ట్వీట్
తాజాగా వైరల్ అవుతున్న ఫొటో(Photo)లో ఉక్రేనియన్ జెండా, రష్యా జెండాలు కప్పుకుని ఉన్న ఓ జంట ఆలింగనం చేసుకుని ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ, “ఉక్రేనియన్ జెండా కప్పుకుని ఉన్న ఓ వ్యక్తి రష్యా జెండా(Russia Flag) ధరించిన మహిళను ఆలింగనం చేసుకున్నాడు. ప్రేమ, శాంతి యుద్ధంపై విజయం సాధించాలి". సంక్షోభ సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్(Tweet) ఒక ఆశను రేకిస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022
ఆ ఫొటో ఎప్పటిదంటే
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ఈ ఫొటో 2019లో తీసింది. ఇది పోలాండ్‌లో బెలారసియన్ రాపర్ మాక్స్ కోర్జ్ కచేరీకి హాజరైన జూలియానా కుజ్నెత్సోవా ఆమె కాబోయే భర్తతో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటో. ఈ చిత్రం 25,000 కన్నా ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫొటో మరింతగా షేర్ అవుతోంది. థరూర్‌తో పాటు పలువురు ఈ చిత్రాన్ని ట్వీట్ చేశారు. నెటిజన్లు థరూర్‌తో ఏకీభవిస్తున్నారు. దేశాల మధ్య శాంతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
యుద్ధం కాదు ప్రేమ
"ఒక చిత్రం వెయ్యి పదాల కన్నా విలువైంది" అని ఓ ట్విట్టర్ వినియోగదారుడు చిత్రాన్ని పోస్ట్ చేసి ఇలా రాశారు. "యుద్ధం కాదు ప్రేమ" అని మరొకరు ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌లో దాడి ప్రారంభించినప్పటీ నుంచి వార్తా సంస్థ AP ప్రకారం శుక్రవారం నాటికి 360 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 137 మంది మరణించారు. ఉక్రెయిన్ కూడా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులందరూ దేశాన్ని విడిచి వెళ్లకూడదని సైనిక చట్టాన్ని విధించింది.