Ukriane Tech Startups: వాట్సాప్ పుట్టిల్లు ఉక్రెయినే, ఎన్నో పెద్ద కంపెనీలు కూడా - టెక్నాలజీలో వారి పాత్ర కీలకం - యుద్ధ ప్రభావం ఉంటుందా?

ప్రపంచంలో ఎన్నో టెక్ స్టార్టప్ కంపెనీల మూలాలు ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి.

FOLLOW US: 

Russia Ukraine Conflict: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా చర్చ ఉక్రెయిన్ గురించే. యూరోప్‌లో రష్యా తర్వాత పెద్ద దేశం ఉక్రెయిన్. ఎన్నో టెక్నాలజీ కంపెనీలకు ఉక్రెయిన్ పుట్టిల్లు. వీటిలో కొన్ని ఇప్పటికీ ఆ దేశంలోనే పనిచేస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్‌లో పురుడు పోసుకున్న కొన్ని ఐడియాలు తర్వాత పెద్ద బ్రాండ్లుగా మారాయి.

ప్రపంచంలో ఎక్కువ టెక్ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. ప్రపంచంలో ఎన్నో పెద్ద టెక్నాలజీ కంపెనీలకు ఉక్రెయిన్ సొంతిల్లు లాంటిది. వీటితో పాటు ప్రపంచంలో ఎన్నో పెద్ద కార్పొరేట్ సంస్థలకు సపోర్ట్ ఇవ్వగల అతిపెద్ద ఐటీ అవుట్ సోర్సింగ్ సెక్టార్ కూడా ఉక్రెయిన్‌లో ఉంది.

వాట్సాప్ ఉక్రెయిన్‌లోనే..

టెక్‌ స్టార్టప్స్, ఐటీ కంపెనీలతో పాటు ఎన్నో టెక్నాలజీ కంపెనీల మూలాలు ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది వాట్సాప్ (Whatsapp). ఉక్రెయిన్‌కు చెందిన జాన్ కొవుమ్ అనే వ్యక్తి 2009లో ఈ సంస్థను స్థాపించారు. మొదట ఇందులో స్టేటస్‌లు మాత్రమే కనిపించేవి. తర్వాత  ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా ఇది ఎంతో పాపులర్ అయింది. 2014లో ఫేస్‌బుక్ (Facebook)... వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

వాట్సాప్ తరహాలోనే ఫిన్‌టెక్ కంపెనీ పేపాల్‌కు (Paypal) కూడా ఉక్రెయిన్ ఇమ్మిగ్రెంట్ అయిన మాక్స్ లెవ్‌చిన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. 1998లో దీన్ని కాన్‌ఫినిటీ పేరుతో స్థాపించారు. 1999లో ఇది ఎక్స్.కాం పేరుకు మారింది. 2002లో మాక్స్ పేపాల్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈబే... పేపాల్‌ను కొనుగోలు చేసింది.

మాక్స్ లెవ్‌చిన్ 2012లో అమెరికాలో పనిచేసే బై నౌ పే లేటర్ అనే కంపెనీని స్థాపించారు. దీంతోపాటు ఈయన ‘Thank You for Smoking’ అనే కంపెనీని కూడా స్థాపించారు. సోషల్ యాప్ డెవలపర్ స్లైడ్.కాం, ఫిన్‌టెక్ స్టార్టప్ హెచ్‌వీఎఫ్‌లకు కూడా ఈయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

స్నాప్‌చాట్ కూడా...

ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) మాతృసంస్థ అయిన స్నాప్‌ను 2015లో లుక్సరీ అనే స్టార్టప్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి ఉక్రెయిన్‌కు చెందిన యూరీ మొనాస్టిర్షిన్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఉక్రెయిన్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ ఇదే. ఆ తర్వాతనే స్నాప్‌చాట్‌లో ఎంతో ఫేమస్ అయిన లెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో (Kyiv) స్నాప్‌కు పెద్ద ఆఫీస్ కూడా ఉంది. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల యూజర్లు ఉన్న మెక్‌పా అనే యాప్ డెవలపర్ కంపెనీ హెడ్ ఆఫీస్‌ కూడా కీవ్‌లోనే ఉంది. మాక్ఓఎస్ యుటిలిటీ యాప్ క్లీన్‌మైమ్యాక్స్ ఎక్స్ ద్వారా ఇది బాగా ఫేమస్.

దీంతోపాటు టైపింగ్ అసిస్టెంట్ అయిన గ్రామర్లీ కూడా ఉక్రెయిన్‌కు చెందిన కంపెనీనే. ఉక్రెయిన్ దేశస్తులైన మ్యాక్స్ లిట్విన్, అలెక్స్ షెవ్‌చెంకో, దిమిట్రో లైడర్‌లు 2009లో ఈ కంపెనీని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కంటెంట్ క్రియేటర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు.

గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు ఉక్రెయిన్‌లో ఆఫీస్‌లు ఉన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడులతో పాటు... సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకింగ్ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్స్ చేస్తున్నారు. సెక్యూరిటీ కోసం సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను లాక్ చేసుకునే విధంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రత్యేక ఫీచర్లను ఉక్రెయిన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కీవ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఈ సేవలపై ఏమైనా ప్రభావం పడుతుందేమో చూడాలి.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

Published at : 26 Feb 2022 05:30 PM (IST) Tags: Russia Ukraine Conflict Russia Ukraine War Ukraine Technology Hub Ukriane Tech Startups Ukriane

సంబంధిత కథనాలు

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?

Realme New Tablet: రియల్‌మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!

Realme New Tablet: రియల్‌మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

In Pics : దావోస్ లో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ భేటీ

In Pics : దావోస్ లో సీఎం జగన్ తో  గౌతమ్ అదానీ భేటీ