X

Twitter New Rule: ట్విటర్‌లో కొత్త రూల్.. ఇక పర్మిషన్ లేకుండా ఆ పని చేయొద్దట!

ఈ తాజా నిబంధన అనేది పబ్లిక్ ఫిగర్స్‌ లేదా సెలబ్రిటీలుగా వెలుగొందే వారి విషయంలో వర్తించదని ట్విటర్ వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్థం రీట్వీట్ చేసిన సందర్భాల్లో కూడా వర్తించబోదని వెల్లడించింది.

FOLLOW US: 

ట్విటర్‌కు కొత్త సీఈవో వచ్చిన వేళ.. ఓ కీలక నూతన నిబంధనను సంస్థ ప్రవేశపెట్టింది. నెట్వర్క్ పాలసీల్లో భాగంగా ఇతరుల ప్రైవేటు ఫోటోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. ట్విటర్‌కు సీఈవో మారిన ఒక రోజులోనే ఈ కీలక మార్పు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొత్త నిబంధనల్లో భాగంగా.. పబ్లిక్ ఫిగర్స్ కాని వ్యక్తులకు సంబంధించిన వారి ఫోటోలను వారి అనుమతి లేకుండా ఎవరైనా పోస్ట్ చేసినట్లు గుర్తిస్తే ఆ చిత్రాలు లేదా వీడియోలను తొలగించాలని ట్విటర్‌ని అడగవచ్చు. అక్కడే ఉండే రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇది పని చేస్తుంది. 

అయితే, ఈ తాజా నిబంధన అనేది పబ్లిక్ ఫిగర్స్‌ లేదా సెలబ్రిటీలుగా వెలుగొందే వారి విషయంలో వర్తించదని ట్విటర్ వెల్లడించింది. అంతేకాక, ప్రజా ప్రయోజనార్థం మీడియా సంస్థలు దాన్ని ఉపయోగించడం లేదా ఎంబేడ్ చేసే సందర్భాల్లో కూడా ఈ నిబంధన వర్తించబోదని స్పష్టం చేసింది.

‘‘ఇతరులు షేర్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను వారు ఏ ఉద్దేశంతో చేశారో తెలుసుకొనేందుకు మేం ప్రయత్నిస్తూనే ఉంటాం.’’ అని ట్విటర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

యూజర్లు తమకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు లేదా సమాచారాన్ని.. ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు ప్రత్యేకించి హానికర ఉద్దేశంతో రీ పోస్ట్ చేయడం అనేది ఒక సమస్యగా మారింది. ఏళ్ల తరబడి దీనికి పరిష్కారం లేదు. ట్విటర్ ఇప్పటికే ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఫోన్ నంబర్ లేదా అడ్రస్ వంటి ప్రైవేట్ సమాచారాన్ని ట్విటర్‌లో బహిర్గతం చేయడాన్ని నిషేధించింది. అయితే ఈ సమాచారంతో ‘వేధింపులకు గురి చేయడం లేదా హాని తలపెట్టడం, భయపెట్టడం, వ్యక్తుల గుర్తింపులను బహిర్గతం చేయడం వంటి ఆందోళనలు ఉన్నాయని ట్విటర్ తెలిపింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ స్ట్రీమింగ్ సైట్ అయిన ట్విచ్‌లో జాత్యహంకార, లైంగికపరమైన, స్వలింగ సంపర్క సంబంధిత ఆన్‌లైన్ వేధింపులు వెలుగు చూశాయి. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వల్ల ఏర్పడ్డ హై ప్రొఫైల్ ఆన్ లైన్ వేధింపులకు సంబంధించిన ఉదాహరణలు. ఇలాంటి వేధింపులకు సంబంధించిన సందర్భాలు కోకొల్లలు. ఆన్‌లైన్ మాధ్యమాల నుంచి తమను తాము బాధపెట్టే, అవమానించే లేదా చట్టవిరుద్ధంగా రూపొందించిన చిత్రాలను చూడటానికి బాధితులు తరచుగా సుదీర్ఘ పోరాటాలు చేయాల్సి ఉంటుంది.

ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తాను కంపెనీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన మరుసటి రోజు ఈ మార్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

Also Read: Parag Agrawal Twitter CEO: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా

Also Read: The Uncle North Korea: ‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Twitter News Twitter New CEO Parag Agrawal Twitter new rule Twitter No Share rule

సంబంధిత కథనాలు

Elon Musk: నీకు రూ.3.75 లక్షలు ఇస్తా.. నన్ను వదిలేయ్ బ్రో.. యువకుడికి ఎలాన్ మస్క్ రిక్వెస్ట్.. ఆ టీనేజర్ ఏం చేశాడంటే?

Elon Musk: నీకు రూ.3.75 లక్షలు ఇస్తా.. నన్ను వదిలేయ్ బ్రో.. యువకుడికి ఎలాన్ మస్క్ రిక్వెస్ట్.. ఆ టీనేజర్ ఏం చేశాడంటే?

Indian family: అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం.. చలికి గడ్డకట్టుకుపోయి..!

Indian family: అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం.. చలికి గడ్డకట్టుకుపోయి..!

Google invest in Airtel: ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ పెట్టుబడి! చీఫ్‌గా స్మార్ట్‌ఫోన్లు తెచ్చేందుకేనా?

Google invest in Airtel: ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ పెట్టుబడి! చీఫ్‌గా స్మార్ట్‌ఫోన్లు తెచ్చేందుకేనా?

NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!

NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!

India-Central Asia Summit: మోదీ నేతృత్వంలో భారత్- సెంట్రల్ ఆసియా సదస్సు.. అఫ్గాన్‌ పరిస్థితులపై ఆందోళన

India-Central Asia Summit: మోదీ నేతృత్వంలో భారత్- సెంట్రల్ ఆసియా సదస్సు.. అఫ్గాన్‌ పరిస్థితులపై ఆందోళన
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!