The Uncle North Korea: ‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష
‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష
కొరియా చిత్రం ‘ది అంకుల్’ సినిమాను దొంగచాటుగా చూస్తున్న ఓ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ బాలుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదేంటీ.. ఆ సినిమా చూడటమే తప్పా? అంత పెద్ద శిక్ష వేసేంత నేరం అతడు ఏం చేశాడు? పైగా బాలుడికి 14 ఏళ్లను జైల్లో పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే.. అది ఉత్తర కొరియా కాబట్టి.
అయితే, ఇటీవల ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సీరిస్‌ను చాటుగా చూడటమే కాకుండా.. ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నించిన విద్యార్థికి విధించిన శిక్షతో పోల్చితే.. ఈ బాలుడు చాలా లక్కీ. ప్రస్తుత ఘటనలోకి వెళ్తే.. హైసన్ సిటీకి చెందిన ఓ బాలుడు అధికారుల కళ్లుగప్పి ‘ది అంకుల్’ అనే దక్షిణ కొరియా సినిమాను చూసేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా ప్లే చేసి.. 5 నిమిషాలు చూశాడో లేదో.. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసేశారు. ఆ సినిమా వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు శిక్షగా 14 ఏళ్లు జైల్లోనే ఉండాలి. వివిధ పరిశ్రమల్లో కూలి పనులు చేయాలి.
Also Read: రోబో ‘చిట్టీ’ ఇక మీ రూపంలో.. దీనికి అంగీకరిస్తే రూ.2 కోట్లు మీవే!
ఇలాంటి శిక్షలు ఉత్తర కొరియాలో కొత్తేమీ కాదు. కొద్ది రోజుల కిందట చైనాకు వెళ్లి.. పెన్ డ్రైవ్‌లో ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సీరిస్‌ను అప్‌లోడ్ చేసుకుని తీసుకొచ్చిన ఉత్తర కొరియా విద్యార్థి, అతడి వెంట వెళ్లిన ఉపాధ్యాయులను సైతం అక్కడి ప్రభుత్వం కఠినంగా శిక్షించింది. ఆ వెబ్‌సీరిస్‌ను చూడటమే కాకుండా.. ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించిన నేర కింద అతడికి మరణించే వరకు ఖైదు విధించాలని కోర్టు ఆదేశించింది. ఉపాధ్యాయులు బాధ్యతగా లేరనే కారణంతో దేశ శివారుల్లో కూలి పనులు చేసేందుకు బదిలీ చేసింది. అయితే, వారిని ఉద్యోగాల నుంచి మాత్రం తొలగించలేదు. చూశారుగా.. ఉత్తర కొరియా గురించి మాట్లాడుకున్న ప్రతిసారి.. మనం చాలా లక్ అనే ఫీలింగ్ కలుగుతుంది కదూ.
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Also Read: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి