Tesla Workers : సిక్ లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Elon Musk : టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఉద్యోగుల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఎక్స్ ను ఆయన కొనుగోలు చేసినప్పుడే స్పష్టమయింది. ఇప్పుడు టెస్లా ఉద్యోగులనూ ఆయన వదిలి పెట్టడం లేదు.
Tesla Workers Push Back After Surprise Sick Leave Home Visits by Managers : వర్క్ ప్లేస్ కొంత మందికి హాయిగా ఉంటుంది.. కానీ చాలా మందికి అదో నరకం. మేనేజర్లు, ఓనర్లు శాడిస్టులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి బాసులు ఉన్న చోట్ల ఉద్యోగుులు వీలైనంత ఎక్కువగా తమ సెలవుల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనారోగ్యం ఉన్నా లేకపోయినా సిక్ లీవులు పెట్టుకుంటూ ఉంటారు. ఎలాన్ మస్క్ కంపెల్లో పనిచేసే ఉద్యోగులు చాలా మంది ఇలాంటి టార్చర్ నే అనుభవిస్తన్నారు. అందుకే కంపెనీకి వారు హాజరయ్యే శాతం తగ్గిపోతోంది.
జర్మనీ గిగా ఫ్యాక్టరీలో ఉద్యోగుల్ని తీవ్రంగా ఒత్తిడి పెడుతున్న మస్క్
జర్మనీలో టెస్లా కంపెనీకి గిగా ఫ్యాక్టరీ ఉంది. యూరప్ దేశాలకు అవసరమైన టెస్లా కార్లను అక్కడే ఉత్పత్తి చేస్తారు. వారిని గరిష్టంగా పిండేయడానికి మస్క్ అనేక రూల్స్ పెట్టారు. అంతే కాదు.. ఓవర్ టైం పని చేసి ఉత్పత్తి లక్ష్యాలను అందుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో కంపెనీలో పని చేసే వాతావరణం నరకంగా మారుతూండటంతో ఉద్యోగులు తమ చట్టబద్దమైన సెలవుల్ని ఎక్కువగా వినియోగించుకుటున్నారు. గిగా ఫ్యాక్టరీలో పదిహేడు శాతం మంది ఎప్పుడూ సిక్ లీవులో ఉంటున్నాు. ఇది సాధారణ ఆటోమోబైల్ ఇండస్ట్రీ సగటు కన్నా చాలా ఎక్కువ కావడంతో మస్క్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు.
తమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కే
తరచూ సిక్ లీవులు పెడుతున్న ఉద్యోగులు - మేనేజర్లను ఇంటికి పంపుతున్న మస్క్
దీంతో జర్మనీ టెస్లాలో పని చేసేవారు తమ విభాగంలో ఉద్యోగులు సిక్ లీవు పెడితే ఇంటికి వెళ్లి వెరీ ఫై చేస్తున్నారు. ఇలా మేనేజర్లు తమ ఇంటికి సమాచారం లేకుండా రావడంపై ఆ ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొహమాట పడకుండా కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారం జర్మనీలో హాట్ టాపిక్ అయింది. ఇలా చేయడం ఉద్యోగుల్ని వేధించడమేనని వారు ఆరోపిస్తున్నారు. వర్క్ ప్లేస్ లో ప్రశాంతత లేకుండా చేసి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఇంటికొచ్చినా సిక్ లీవులు పెట్టుకున్నా అదే టార్చర్ పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టప్పర్‌వేర్ కంపెనీ ఎందుకు దివాలా తీసింది ? నోకియాలాగే మార్పును అందుకోలేకపోయిదా?
టెస్లాలో పని చేయడాన్ని నరకంగా భావిస్తున్న ఉద్యోగులు
ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేయడంలో ఎలన్ మస్క్ ను మించిన వారు లేరని చెబుతూంటారు. ఆయన పెట్టే ఒత్తితి తట్టుకోలేక.. ఎప్పటిక్పపుడు ఉద్యోగులు సెలవులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.సెలవులు పెడుతూ ఉంటారు కూడా. అమెరికాలోని స్సేప్స్ ఎక్స్ ఉద్యోగులు, ఎక్స్ ఉద్యోగులు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూంటారు. మస్క్ కంపెనీల్లో పని చేయడాన్ని ఉద్యోగులు నరకంగా భావించే పరిస్థితి వచ్చింది.