Tupperware : టప్పర్‌వేర్ కంపెనీ ఎందుకు దివాలా తీసింది ? నోకియాలాగే మార్పును అందుకోలేకపోయిదా?
Tupperware Brands Corp : టప్పర్‌వేర్.హైక్లాస్ నుంచి మధ్యతరగతి భారతీయుల కుటుంబాల్లో ఈ కంపెనీ ఉత్పత్తులు ఉంటాయి. ఒక్క ఇండియాలోనే కాదు. వరల్డ్ పాపులర్ బ్రాండ్. ఈ కంపెనీ ఇప్పుడు దివాలా తీసింది. ఎందుకంటే ?
Tupperware is bankrupt Why : టప్పర్ వేర్ బ్రాండ్స్ కార్పొరేషన్ తమ దగ్గర చిల్లిగవ్వ లేదని అమెరికా కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆస్తులు ఒక బిలియన్ వరకూ ఉంటాయని.. అదే సమయంలో అప్పులు పది బిలియన్ల వరకూ ఉంటాయని దివాలా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ టప్పర్‌వేర్ కంపెనీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ఇండియాలో కూడా అందరి ఇళ్లల్లోకి వచ్చేలా విస్తరించింది. ఇంత సక్సెస్ అయిన కంపెనీ ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది ?
పరిస్థితులకు తగ్గట్లుగా మారడంలో విఫలమైన టప్పర్ వేర్ యాజమాన్యం
టప్పర్‌వేర్ కిచెన్ వస్తువులు తయారు చేసే కంపెనీ. 1946లో అమెరికాలో ప్రారంభమైన కంపెనీ.. ప్లాస్టిక్ ఫుడ్ కంటెయినర్ల విషయంలో విప్లవం సృష్టించిందని అనుకోవచ్చు. దాన్ని ప్రపంచవ్యాప్తం చేయంలో టప్పర్ వేర్ వ్యవస్థాపకుడు కార్ల్ టప్పర్ విజయం సాధించారు. మన దేశంలో ఇంకా వేగంగా విస్తరించారు. ఖరీదు అయనప్పటికీ.. మహిళలతోనే మార్కెటింగ్ చేసుకునే వ్యూహం అవలభించడంతో టప్పర్ వేర్ పాపులర్ బ్రాండ్ అయిపోయింది. కానీ కాలానికి తగ్గట్లుగా మారలేకపోవడంతో .. కంపెనీ దివాలా తీసింది.
వ్యాపారం మీది, పెట్టుబడి ప్రభుత్వానిది - ఏ పథకం నుంచి ఎంత డబ్బు వస్తుంది?
ఆన్ లైన్ అమ్మకాల వైపు దృష్టి సారించకపోవడం మైనస్
ప్రజల అవసరాలు, అలవాట్లలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గుర్తించి ఉత్పత్తులను మార్చుకోకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా పతనమైపోవడానికి ఎక్కువ కాలం పట్టదని అనుకోవచ్చు. సెల్ ఫోన్ ప్రజల చేతుల్లోకి వచ్చినప్పుడు ప్రపంచాన్ని శాసించింది నోకియా. కానీ ఆ ఫోన్ స్మార్ట్ గా మారిపోతుందని గుర్తించినా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా .. ఇప్పుడు నోకియా కంపెనీ అడ్రస్ లేదు. టప్పర్ వేర్‌ది కూడా అదే పరిస్థితి. ప్రజల కొనుగోళ్ల అభిరుచురు మారుతున్నాయని పదేళ్ల కిందటే గుర్తించినా దానికి తగ్గట్లుగా మారలేకపోయారు.
ఉద్యోగంలో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష పీఎఫ్ విత్‌డ్రా - కొత్త రూల్ వచ్చిందిగా!
చివరికి దివాలా తప్పలేదు!
ప్రపంచం అంతా ఆన్ లైన్ సేల్స్ కు మారుతున్న సమయంలోనూ టప్పర్ వేర్ సంప్రదాయ మార్కెటింగ్ కే ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా పోటీ కంపెనీలు సేల్స్ పెంచుకున్నాయి. టప్పర్ వేర్ ఉత్పత్తుల విక్రయాలు క్రమంగా పడిపోయాయి. కరోనా సమయంలోనే గడ్డు పరిస్థితికి చేరుకుంది. అయితే కరోనా తర్వాత కాస్త పుంజుకున్నట్లుగా కనిపించినా తర్వాత తగ్గిపోవడం ప్రారంభించాయి. ఇప్పుడు నిర్వహించడం సాధ్యం కాని స్థితికి వచ్చిందని గుర్తించి.. కంపెనీని దివాలా తీసినట్లుగా ప్రకటించారు.
భారతీయుల్లో దాదాపుగా సగం మంది ఇళ్లల్లో టప్పర్ వేర్ ఉత్పత్తులు ఉంటాయి. అంతగా భారతీయులతో కలిసిపోయిన కంపెనీ దివాలా తీయడం.. చాలా మందిని బాధపెట్టింది.