2025 Feels Cursed : 2025కి శాపం తగిలిందా! ఓవైపు ఉగ్రవాద దాడులు, యుద్ధాలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు!
2025 Feels Cursed : 2025కి శాపం తగిలినట్టు ఉంది. ఏడాది ప్రారంభం నుంచి ఏదో అనర్థం జరుగుతూనే ఉంది. ఓవైపు ప్రకృతి వైపరిత్యాలు ముంచెత్తుతుంటే... మరోవైపు మానవ ప్రేరిపిత విపత్తులు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

2025 Feels Cursed : 2025 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగుతోంది. ఏదో చోట గొడవలు, యుద్ధం, ప్రకృతి వైపరిత్యాల ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరుస ఘర్షణలు, సంక్షోభాలు తలెత్తుతున్నాయి. పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన ఇండో-పాక్ ఘర్షణ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత అలజడి సృష్టిస్తోంది. ఇది ఈ మధ్యకాలంలోనే కాదు జనవరిలోనే ఇలాంటి ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
ఈ విషయాలను ఏడాది మొదట్లోనే ఈ విషయాలపై చాలా మంది జ్యోతిష్కులు క్లారిటీ ఇచ్చారు. వారు చెప్పినదాని కంటే ఎక్కువగానే అలజడి ఉంది.
మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందా?
స్వామి యోగేశ్వరానంద గిరి, మహాభారత కాలంలో కనిపించిన గ్రహ కూటమి నాటి అరుదైన గ్రహాల అమరిక ఇప్పుడు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇది ప్రపంచ యుద్ధానికి సూచికగా అభిప్రాయపడుతున్నారు. అదే టైంలో భారత దేశం మాత్రం ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుందని అంచనాలు వేస్తున్నారు.
గత సంవత్సరం ఏం అంచనా వేశారు: "మే 30 ప్రాంతంలో ఒక గ్రహ సమీకరణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఆరు గ్రహాలు మహాభారతం లేదా గతంలో జరిగిన పెద్ద యుద్ధాల సమయంలో చూసిన విధంగా ఉంటున్నాయి " అని స్వామి యోగేశ్వరానంద గిరి అన్నారు.
మరొక భారతీయ జ్యోతిష్కుడు కుశాల్ కుమార్ ఇప్పటి పరిస్థితిని గత ఏడాదే అంచనా వేశారు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ గురించి గతంలోనే చెప్పుకొచ్చారు.
2025 ఇలా ఉంటుందని ఒక్క భారతీయ జ్యోతిష్యులే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న జ్యోతిష్యులు కూడా అంచనా వేశారు. శతాబ్దాల క్రితం, ఫ్రెంచ్ జ్యోతిష్కుడు 2025లో జరగనున్న ప్రాణాంతక విషయాలు గురించి వివరించారు. ప్లేగు, గ్రహశకలం ఢీకొనడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అన్నింటి గురించి తెలిపారు.
ఇప్పుడు చెప్పిన వాళ్లంతా ప్రధాన మీడియాలో వివరాలు అందచేసిన వాళ్లు. అలా కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వేల మంది 2025 ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిపారు. సమీప భవిష్యత్తులో ఒక పెద్ద సంఘర్షణ జరిగే అవకాశం ఉందన్నారు.
వీటన్నింటినీ క్రోడీకరించి ఇండియా టుడే జ్యోతిష్కుడు పండిట్ అరుణేష్ కుమార్ శర్మ అభిప్రాయాన్ని ప్రచురించింది. ఆయన మాట్లాడుతూ ప్రపంచ నాయకుల తప్పుడు నిర్ణయాలు, గ్రహ ప్రభావాలు రెండూ అశాంతికి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చారు. వచ్చే కాలంలో ఇది మరింత తీవ్రం అవుతుందని అన్నారు. అంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
"మార్చి 30, 2025న ప్రారంభమైన విక్రమ్ నామ సంవత్సరం ఈ క్యాలెండర్ ప్రకారం, సంవత్సరపు రాజు. మంత్రి ఇద్దరూ సూర్యునిచే ప్రాతినిధ్యం వహిస్తారు, ఇది శక్తివంతమైన నాయకులను సూచిస్తుంది. అదే సమయంలో, శని ప్రజలను సూచిస్తుంది. ఈ కలయిక నాయకుల అహంకారం, వింత నిర్ణయాలు సామాన్య ప్రజలకు బాధ కలిగిస్తాయని సూచిస్తున్నాయి" అని పండిట్ అరుణేష్ కుమార్ శర్మ ఇండియా టుడేకు చెప్పారు.
2025 సంవత్సరంలో ముఖ్యంగా జూన్, జులైలో ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉంటుందని, యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది జ్యోతిషశాస్త్ర కారకాలతోపాటు పాలకుల నిర్లక్ష్యం రెండింటి వల్ల ఏర్పడుతుందని అన్నారు.
జూన్ 7, జులై 28 మధ్య సంఘర్షణ, దాచిన ప్రమాదాలకు కారణమయ్యే గ్రహాలైన కుజుడు, కేతువు అమరిక భూకంపాలు, అగ్నిప్రమాదాలు, యుద్ధాలు, ఇతర ప్రధాన ఘటనలకు దారితీయవచ్చు. వచ్చే జనవరి, మార్చిలో కూడా ఇలాంటివి జరగొచ్చు.
జూన్ 12 విమాన ప్రమాదం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, భారతదేశంలో ఉగ్రవాద దాడి, హెలికాప్టర్ ప్రమాదాలు వంటి ఘటనలన్నీ ఈ అల్లకల్లోల దశకు దారితీసే వాటికి ఉదాహరణలు.





















