Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!
Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించారు. అధ్యక్షుడు పారిపోవడంతో నిరసనలు చెలరేగే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
![Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు! Sri Lanka Declares state of emergency after president Gotabaya Rajapaksa flees: PM's office Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/663a82e8f57819dcc8dcc5a8cac4ee941657693414_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో ఆ దేశ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
#BREAKING Sri Lanka declares state of emergency after president flees: PM's office pic.twitter.com/0IkJMZKKJV
— AFP News Agency (@AFP) July 13, 2022
పరార్
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
#UPDATE Sri Lanka's embattled president has flown out of his country to the Maldives.
— AFP News Agency (@AFP) July 12, 2022
Gotabaya Rajapaksa had promised at the weekend to clear the way for a "peaceful transition of power" after fleeing his official residence in Colombo https://t.co/TihIDmv97O pic.twitter.com/Bdqupus0G2
మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది.
నిరసనలు
అధ్యక్షుడు పారిపోవడంతో నిరసనకారులు కొన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది గొటబాయను దేశం విడిచి పారిపోయేందుకు ప్రభుత్వం సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దేశంలో మళ్లీ హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఏర్పాటు
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉన్నందున శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎస్‌జేబీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read: Watch: నయాగరా అనుకున్నారా? జోగ్ జలపాతం, ఇది అంతకుమించి- కుదిరితే ఓసారి వెళ్లి రండి!
Also Read: United Kingdom Heatwave: భారత్‌లో వాన దంచికొడుతుంటే యూకేలో ఉక్కబోస్తుంది- ఎమెర్జెన్సీ ప్రకటిస్తారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)