అన్వేషించండి

Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం- నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ -9 రాకెట్

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ దూసుకెళ్లింది.

Shubhanshu Shukla : NASAకు చెందిన Axiom 4 మిషన్ అనేక అవంతరాలు, ఇతర సమస్యలు దాటుకొని బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. SpaceX నిర్వహించే ఈ మిషన్‌లో శుభాన్షు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ట్రావెల్ చేస్తున్నారు. SpaceX కొత్త డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి బయల్దేరింది. ఈ అంతరిక్ష నౌకను కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 

NASA ముందుగా చెప్పినట్టు గురువారం సాయంత్రం 4:30 గంటలకు IST వద్ద డాక్ చేయనుంది. Axiom 4 మిషన్‌లో అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలో నలుగురు సిబ్బంది ఉంటారు, శుక్లా పైలట్‌గా ఉంటారు. పోలాండ్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన HUNOR వ్యోమగామి టిబోర్ మిషన్ నిపుణులుగా వ్యవహరిస్తారు. వ్యోమగాములు 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటారు, అక్కడ వారు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు.

Axiom 4 మిషన్ NASA, Axiom Space,SpaceX సహకారంతో నిర్వహించే నాల్గో ప్రైవేట్ అంతరిక్ష యాత్ర. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా సహా నాలుగురు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఈ మిషన్‌లో 31 దేశాలకు చెందిన 60కుపైగా పరిశోధనలు చేయనున్నారు. ఇందులో భారత్‌ నుంచి కూడా ప్రయోగాలు చేయనున్నారు.  

శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తారు?  
శుభాంశు శుక్లా ప్రధానంగా ఏడు పరిశోధనలు చేయనున్నారు. ఆరోగ్యం, పోషణ, మైక్రోగ్రావిటీ పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. ఈ ప్రయోగాలు భారత భవిష్యత్ అంతరిక్ష మిషన్‌నైన గగన్‌యాన్ యూజ్ కానుంది. 

మెంతులు, పెసర పెంపకం: శుభాంశు అంతరిక్షంలో మెంతులు, పెసర పెరుగుదలపై ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రయోగం మైక్రోగ్రావిటీలో పంటల పెరుగుదలను అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయాణాల్లో ఆహార అవసరాల కోసం కూడా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. 

మైక్రోఅల్గా పరిశోధన: ఆయన మైక్రోఅల్గా వృద్ధి, మెటబాలిజంపై అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధన అంతరిక్షంలో ఆక్సిజన్ ఉత్పత్తి, ఆహార వృద్ధిపై సరికొత్త ఆశలు రేకెత్తించనుంది.  

సైనోబ్యాక్టీరియా అధ్యయనం: రెండు రకాల సైనోబ్యాక్టీరియా, సెల్ స్పందనలను పరీక్షిస్తారు. ఇది అంతరిక్షంలో జీవ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

పంట గింజల పెరుగుదల: అంతరిక్షంలో పంట గింజల పెరుగుదల, దాని ప్రభావాలు పరీక్షిస్తాడు. ఈ డేటా భవిష్యత్ అంతరిక్ష కాలనీల కోసం ఆహార ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

కాగ్నిటివ్ పరిశోధన: కంప్యూటర్ స్క్రీన్‌ల వినియోగం మైక్రోగ్రావిటీలో మనిషి మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తారు.  

ఈ ప్రయోగాలను ISRO, NASA, భారత డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) సహకారంతో చేస్తున్నారు.  

ఈ ప్రయోగాల ప్రయోజనాలేంటీ?
శుభాంశు శుక్లా చేసే ఈ పరిశోధనలు భారత గగన్‌యాన్ మిషన్‌కు గొప్ప మద్దతు ఇవ్వనున్నాయి. ఇది 2027లో జరగనుంది. ఈ ప్రయోగాల ద్వారా అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరా, ఆస్ట్రోనాట్‌ల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక డేటా సేకరించనుంది. శుభాంశు శుక్లా ఈ మిషన్ కోసం ఎంతో కఠినమైన శిక్షణ పొందారు. 2019లో ISROచే ఎంపికైన ఆయన రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Makar Sankranti:మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
Embed widget