Chat Gpt లో స్కార్లెట్ జాన్సన్ వాయిస్ – షాక్ తిన్న స్టార్ హీరోయిన్ కీలక నిర్ణయం
Chat GPT Scarlett Johansson | అద్భుతమైన ఆవిష్కరణలతో అందరికీ షాక్ ఇచ్చే టెక్నాలజీ కంపెనీ Open AI – Chat GPT గట్టి దెబ్బే తగిలింది. హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ Open AI కి లీగల్ నోటీసు పంపారు.
Scarlett Johansson shocked by Open AI chatbot SKY imitation | ప్రముఖ టెక్నాలజీ సంస్థ Open AI కు హాలీవుడ్ స్టార్ నటీమణి Scarlett Johansson లీగల్ నోటీసు పంపారు. ఆ సంస్థ చేసిన పనికి తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని... పూర్తి షాక్‌కు గురిచేసిందన్నారు.
స్కార్లెట్ వాయిస్ వాడేసిన Open AI:
ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ AI దిగ్గజ సంస్థ Open AI ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలుసు. ఆ సంస్థ నుంచి వచ్చిన Chat GPT మొత్తం AI ఫీల్డ్‌నే శాసిస్తోంది. Chat GPT 4.0 వెర్షన్‌లో వాడిన ఓ వాయిస్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. చాట్ బోట్ SKY కోసం వినియోగించిన వాయిస్ ప్రముఖ హాలీవుడ్ స్టార్ Scarlett Johansson ను పోలి ఉంది. పోయిన వారం విడుదలైన 4.0 వెర్షన్‌లో Chatbot SKY కోసం జాన్సన్ 2013లో నటించిన Her అనే మూవీ వాయిస్ వాడారన్నది ఆరోపణ. దీనిపై స్పందించిన Open AI ప్రస్తుతానికి ఆ వాయిస్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Open AI కి లీగల్ నోటీస్ పంపిన Scarlett Johansson
చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే చర్చకు దారితీసింది. చాట్ బోట్ వాయిస్ స్కార్లెట్‌ను పోలి ఉందనే చర్చ మొదలైంది. అయితే Open AI తమ చాట్ బోట్ SKY కోసం మొదట స్కార్లెట్ వాయిస్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను సంప్రదించారు. . ఏదైనా టెక్స్ట్ కాపీని వాయిస్‌లో చదవడం కోసం SKY Chatbot ను వాడతారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని స్కార్లెట్ ఓ స్టేట్‌మెంట్ ద్వారా బయట పెట్టారు. స్కై వాయిస్ అచ్చం తన స్వరంలా ఉండటంతో స్కార్లెట్ ఖంగు తిన్నారు. Open AI చేసిన పని తనను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసిందన్నారు.
కిందటేడాది సెప్టెంబర్ లో Open AI ఫౌండర్, CEO Sam Altman నన్ను సంప్రదించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్‌ను మనుషులకు మరింత చేరువ చేయడానికి, టెక్నాలజీ క్రియేటివ్ సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి నా స్వరం ఉపయోగపడుతుందని, చాట్‌జీపీటీకి వాయిస్ ఇవ్వాలని ఆట్‌మాన్ కోరారు. అయితే దాని గురించి ఆలోచించిన మీదట ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను “ అని స్కార్లెట్ చెప్పారు.
“వారం కిందట ఈ ప్రొడక్ట్ రిలీజ్ అయ్యాక ఆ వాయిస్ గురించి విని షాక్ తిన్నాను. ఆ వాయిస్ అచ్చం నా స్వరాన్ని పోలే ఉంది. 2013 లో నేను నటించిన Her సినిమాలోని నా వాయిస్ ను తీసుకున్నారు. నా స్నేహితులు, సన్నిహితులు కూడా అదే అంటున్నారు. ఇది తెలిసి చాలా కోపం వచ్చింది. ఈ ప్రొడక్టును రిలీజ్ చేయడానికి రెండు రోజులు ముందు కూడా ఆట్‌మాన్ మరోసారి నా ఏజంట్‌ను సంప్రదించారు. ఆఫర్‌ను రీ కన్సిడర్ చేయాలని కోరారు” అంటూ స్కార్లెట్ ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.
ఈ పరిణామాలపై లీగల్ చర్యలు తీసుకున్నట్లు కూడా ఆమె చెప్పారు. “మా లాయర్ రెండు లీగల్ నోటీసులు పంపిన తర్వాత వాళ్లు ఆ వాయిస్‌ను నిలిపేశారు.” అన్నారు. ఈ మొత్తం వ్యవహారైంపై స్కార్లెట్ ఆందోళన వ్యక్తం చేశారు. “డీప్ ఫేక్‌లు పెరిగి పోయి మన సొంత ఐడెంటిటీనే ప్రశ్నగా మారుతున్న తరుణంలో ఇలాంటివి రావడం మరింత ఆందోళన కరం. దీనికి పారదర్శకమైన ముగింపు రావాలని.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులు పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ వివాదంపై Open AI కూడా స్పందించింది. వివాదస్పదమైన SKY వాయిస్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్కార్లెట్ మీద ఉన్న గౌరవంతో ప్రస్తుతానికి ఆ వాయిస్‌ను తమ ప్రొడక్టుల నుంచి తీసివేస్తున్నానని చెప్పిన సంస్థ.. తాము స్కార్లెట్ వాయిస్‌ను కాపీ చేయలేదని చెప్పింది. ఇందుకోసం తాము వాయిస్ ఆర్టిస్ట్‌లను ఉపయోగించామని.. పది రకాల వాయిస్‌లను పరీక్షించి ఒకదానిని ఎంపిక చేశామని చెప్పింది. అయితే ఈ వాదనను స్కార్లెట్ అంగీకరించలేదు. ఆట్‌మాన్ చేసిన ట్వీట్‌లో కూడా Her అంటూ హింట్ ఇచ్చారని ఆమె వాదించారు.