Russian Emergency Minister Demise: కెమెరామెన్‌ను రక్షించిన రష్యా మంత్రి.. అంతలోనే ఊహించని విషాదం..
ఓ వ్యక్తిని కాపాడే క్రమంతో మంత్రి తన ప్రాణాల్నే పణంగా పెట్టారు. ఆ దేశమంతా ఆయన సాహసాన్ని మెచ్చుకుంటూనే, ప్రాణాలు కోల్పోయిన నేత మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
సాధారణంగా పదవి చేతికి వచ్చిందంటే తమ సొంత వ్యవహారాలు చక్కబెట్టే పనిలో మాత్రమే నేతలు తలమునకలై ఉంటారని అంతా భావిస్తుంటారు. కానీ రష్యాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తిని కాపాడే క్రమంతో మంత్రి తన ప్రాణాల్నే పణంగా పెట్టారు. ఆ దేశమంతా ఆయన సాహసాన్ని మెచ్చుకుంటూనే, ప్రాణాలు కోల్పోయిన నేత మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆ వివరాలు మీకోసం..
రష్యా ఎమర్జెన్సీ మినిస్టర్ యెవ్‌గెని జినిచేవ్ (55) మాక్ డ్రిల్ శిక్షణలో పాల్గొన్నారు. నార్లిస్క్‌లోని ఆర్కిటిక్ పట్టణంలో అధికారులు బుధవారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారి పోయాడు. ఎవరూ సహాయం చేయకపోతే అతడు చనిపోయేవాడు. కానీ అక్కడే ఉన్న అత్యవసరశాఖ మంత్రి యెవ్‌గెని జినిచేవ్ తక్షణమే స్పందించారు. కెమెరామెన్‌ను కొండపై నుంచి పడిపోకుండా కాపాడగలిగారు. కానీ ఈ ప్రయత్నంలో కొన్ని సెకన్ల తరువాత మంత్రి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
రష్యా మీడియా ఆర్టీ చీఫ్ ఎడిటర్ మార్గరిటా సిమాన్‌యన్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కెమెరామెన్, మంత్రి యెవ్‌గెని జినిచేవ్ కొండ అంచున నిలుచున్నారు. ఇంటర్నల్ డ్రిల్‌లో భాగంగా వెళుతున్న కెమెరామెన్ అక్కడి నుంచి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న రష్యా ఎమర్జెన్సీ మినిస్టర్ కిందకి దూకి కెమెరామెన్ ప్రాణాలు రక్షించారు. కెమెరామెన్ సురక్షితమని భావిస్తున్న సమయంలో పట్టుతప్పడంతో మంత్రి కొండపై నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు’ అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
రష్యా అధ్యక్షుడు సంతాపం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంత్రి యెవ్‌గెని జినిచేవ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంత్రి యెవ్‌గెని జినిచేవ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూఎస్ఎస్ఆర్ చివరి రోజుల్లో కేజీబీ సెక్యూరిటీగా జినిచేవ్ సేవలు అందించారు. 2006 - 2015 మధ్య కాలంలో పుతిన్ సెక్యూరిటీ బాధ్యతలు చూసుకున్నారు. కాలినింగ్రాడ్ యాక్టివ్ గవర్నర్‌గా సేవలు అందించారు. 2018 మే నెలలో ఎమర్జెన్సీ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జినిచేవ్.. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Also Read: వీడెవడండి బాబు.. ఏకంగా ఫోన్ మింగేశాడు, చివరికి ఇలా బయటకొచ్చింది!