Russia Ukraine War: ఉక్రెయిన్‌కు రష్యా అల్టిమేటం- పుతిన్‌కు కోపమొచ్చిందేమో!

ఉక్రెయిన్‌ సైనికులకు రష్యా తాజాగా హెచ్చరికలు చేసింది. ఆయుధాలు పక్కన పెట్టాలని తెలిపింది.

FOLLOW US: 

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సైనికులు ఆయుధాల్ని పక్కనపెట్టాలని రష్యా తాజాగా హెచ్చరించింది. తక్షణమే ఆయుధాలు పక్కన పెట్టాలని ఉక్రెయిన్ బలగాలకు పిలుపునిచ్చింది.

అల్టిమేటం

ఓడరేవు నగరం మరియాపోల్‌ను ఇప్పటికే రష్యా సేనలు ముట్టడి చేశాయి. దీంతో మరియాపోల్ రక్షకులు తమ ప్రతిఘటనను ఆపేయాలని కొత్త అల్టిమేటం జారీ చేసింది. తలాతోకలేని ఉక్రెయిన్‌ యోధుల పోరాటాన్ని ఆపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది.

" మరియాపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తమ ఆయుధాల్ని పక్కపెడితే వారి ప్రాణాలకు మేం హామీ ఇస్తాం. వెంటనే ఆయుధాలను పక్కన పెట్టాలి.                                                                                "
-రష్యా రక్షణ శాఖ

50 రోజులు 

ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధం 50 రోజులు దాటింది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు. 

ఫిబ్రవరి నెలాఖర్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. అప్పటినుంచి ఎన్నో దఫాలుగా చర్చలు జరుపుతూనే మరోవైపు ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపించింది రష్యా. అయితే యుద్ధం మొదలైనప్పటినుంచి ఈ నెలవ 17 వరకు రష్యా 2,002 సాయుధ వాహనాలు, 148 యూఏవీలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. 

ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ ద్వారా యుద్ధానికి సంబంధించి పలు వివరాలు షేర్ చేసుకున్నారు. తమ దేశంపై రష్యా యుద్ధం మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపుగా 20,300 ఆర్మీ సిబ్బంది, 773 యుద్ధ ట్యాంకులు, 2002 సాయుధ వాహనాలు, 376 ఆర్టిలరీ సిస్టమ్స్, 127 రాకెంట్ లాంచర్స్, 66 యూనిట్ల వైమానిక దళ సామాగ్రి, 165 విమానాలు, 146 హెలికాప్టర్లు, 1,471 ఆటోమేటిక్ ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఓడలు, పడవలు కలిపి 8 వరకు  రష్యా నష్టపోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ బహిర్గతం చేశారు. 

Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం

Also Read: Anonymous Hackers: శ్రీలంకపై ఆ హ్యాకర్ల పంజా- ఏం చేసుకుంటారో చేసుకోమని ట్విట్టర్‌కు సవాల్ 

Published at : 19 Apr 2022 05:09 PM (IST) Tags: Russia Russia Ukraine War Ukraine war Russia's new warning

సంబంధిత కథనాలు

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు