By: ABP Desam | Updated at : 19 Apr 2022 04:25 PM (IST)
Edited By: Murali Krishna
శ్రీలంకపై ఆ హ్యాకర్ల పంజా- ఏం చేసుకుంటారో చేసుకోమని ట్విట్టర్‌కు సవాల్
రష్యా, శ్రీలంకలకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. 'Anonymous Hackers' అనే హ్యాకర్ల ముఠా ఈ రెండు దేశాలపై సైబర్ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక సమాచారాలను ఇప్పటికే బయటపెట్టిన ఈ హ్యాకర్ల ముఠా ఇప్పుడు తాజాగా శ్రీలంకపై దృష్టి సారించింది.
ఎనానిమస్ హ్యాకర్ల దాడులు:
Anonymous అంటే గుర్తు తెలియని, పేరు తెలియని అని అర్థం. ఇప్పుడు ఇదే పేరుతో ఓ హ్యాకర్ల ముఠా నియంతృత్వ పోకడలను అనుసరిస్తోన్న దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేకించి ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపుతున్న రష్యాకు సవాళ్లు విసురుతోంది. అసలు వీళ్లు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. ఏదో జోకర్ మాస్క్ వేసుకుని వీడియోలు చేస్తుంటారు. హ్యాకింగ్ పాల్పడుతున్నామని చెప్పి మరీ చేయటం వీళ్ల స్టైల్.
రష్యాకు చుక్కలు
రష్యాకు సంబంధించిన కీలక సమాచారాలను ఈ హ్యాకర్ల ముఠా బయటపెడుతోంది. సైబర్ దాడుల ద్వారా రష్యా ప్రభుత్వ వెబ్ సైట్లలోకి చొరబడుతూ వివరాలను బహిర్గతం చేస్తోంది. 15 రోజులుగా క్రిమియాకు సంబంధించిన ఎన్నో కీలక డాక్యుమెంట్లను ఈ హ్యాకర్ల ముఠా లీక్ చేసినట్లు సమాచారం. రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌కు సంబంధించి ఉక్రెయిన్ అగ్రెషన్‌పై సేకరించిన 446 జీబీ డేటాను ఈ హ్యాకర్లు తస్కరించారు. అంతేకాదు ఉక్రెయిన్‌కు సంబంధించి క్రిమియా అధికార ఈ లైబ్రరీలో 4 లక్షల పైచిలుకు ఫైళ్లను సైతం ఎనానిమస్ హ్యాక్ చేసింది. అయితే రష్యన్ మీడియా ఎక్కడా ఈ వివరాలను ప్రచురించకుండా పుతిన్ సర్కారు జాగ్రత్త పడుతోందని ఎనానిమస్ చెబుతోంది.
Putin humiliated via #Anonymous: 400,000 secret files leaked as hackers vow to end Ukraine aggression.https://t.co/rEOe5gYv4U
— Anonymous (@YourAnonNews) April 13, 2022
విపరీతమైన ఫాలోయింగ్
ఎనానిమస్ ట్విట్టర్ అకౌంట్‌కు దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని, సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు ఈ హ్యాకర్లు. ఈ ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేయలాని ప్రయత్నాలు జరిగినా ఎందుకో అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయలేకపోతోంది ట్విట్టర్. చేతనైంది చేసుకోండి అని ఎనానిమస్ గ్రూప్ కూడా ట్విట్టర్‌కు సవాళ్లు విసురుతోంది.
శ్రీలంకపై
తాజాగా ఎనానిమస్ శ్రీలంకపై దృష్టి పెట్టింది. అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా గొటబయ రాజపక్స మధ్యంతర ప్రభుత్వాల వైపు ఆలోచనలు సాగిస్తుండటాన్ని స్థానిక లంకవాసులే వ్యతిరేకిస్తున్నారు. శ్రీలంక యువత నుంచి వస్తున్న రిక్వెస్టులతో ఎనానిమస్ హ్యాకర్ గ్రూప్ శ్రీలంక పైనా దృష్టి సారించింది. ఐఎంఎఫ్‌తో శ్రీలంక సాగిస్తోన్న చర్చల పత్రాలను బహిర్గంత చేసిన ఈ గ్రూప్ తాజాగా సింహపుత్ర ఫైనాన్స్ ఫర్మ్‌ను సైతం హ్యాక్ చేసింది. ఈ మేరకు ఎనానిమస్ గ్రూప్ ట్విట్టర్‌లో హ్యాక్ అయిన సైట్లను ప్రచురించింది.
అక్కడితో వదిలేయలేదు రాజపక్సే వంశస్తుల ఆస్తులు, వాళ్లు ధరిస్తున్న నగలు, వాళ్ల విలువైన బహుమతులు ఇలా చాలా వ్యక్తిగత వివరాలను ఎనానిమస్ బయటపెడుతోంది. అసలే తినటానికి తిండి లేక లంకవాసులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ల పరిపాలకులు ఎంత సంపాదించి దాచుకుంటున్నారో చెబుతూ అనానమిస్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక ప్రభుత్వానికి ఈ హ్యాకర్లు గుంపు చేస్తోన్న సైబర్ దాడులు పుండు మీద కారం చల్లినట్లే అని అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
Don Dawood In Karachi: కరాచీలో దావూడ్ ఇబ్రహీం- ఈడీ విచారణలో చెప్పిన ఛోటా షకీల్ బావ
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!