Russia Ukraine News: అంతర్జాతీయ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు- పర్లేదా మరి?
అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా భారత జడ్జి ఓటు వేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక ఆపసేషన్లను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. ఐసీజే ఇచ్చిన ఆదేశాలను అమెరికా స్వాగతించింది. వెంటనే రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రప్పించాలని అమెరికా డిమాండ్ చేసింది.
రష్యా వ్యతిరేకంగా భారత్
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను రష్యా ఫెడరేషన్ తక్షణమే నిలిపివేయాలని ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ జోన్ డోనహ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. తుది తీర్పును ఐసీజే పెండింగ్‌లో పెట్టింది. అయితే ఐసీజేలో భారత జడ్జీ జస్టిస్ దల్వీర్ భండారీ ఈ కేసులో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
విరుద్ధంగా
జస్టిస్ దల్వీర్ భండారీ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో 2012 నుంచి సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2017 నవంబర్‌లో మరోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 9 ఏళ్ల పాటు ఆ స్థానంలో ఉండేందుకు 2018 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
ఐరాస టాప్ కోర్టుకు ప్రభుత్వ మద్దతు సహా వివిధ మిషన్ల సాయంతో జస్టిస్ భండారీ నామినేట్ అయ్యారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఆయన వేసిన ఓటు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తెలుస్తోంది. రష్యా- ఉక్రెయిన్ వివాదంపై ఆయన అభిప్రాయానికి ఆధారంగానే ఆయన ఓటు వేశారు. ఎందుకంటే ఈ అంశంపై భారత అధికారిక స్టాండ్ వేరుగా ఉంది.
ఉక్రెయిన్- రష్యా వివాదంపై ఐరాసంలో జరిగిన ఓటింగ్‌కు భారత్ రెండు సార్లు దూరంగా ఉంది. చర్చల ద్వారానే ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ చెప్పింది.
ఇద్దరు వ్యతిరేకం
ఐసీజే ఇచ్చిన ఆదేశాలకు 13 మంది జడ్జీలు అనుకూలంగా ఓటు వేయగా ఇద్దరు వ్యతిరేకించారు. వైస్ ప్రెసిడెంట్ కిరిల్ జివోర్జియన్ (రష్యా), జడ్జి జియో హాంకిన్ (చైనా).. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
Also Read: Holi 2022: చితాభస్మంతో హోలీ సంబరాలు, అక్కడ పండుగ ప్రత్యేకతే వేరు